ETV Bharat / bharat

'పుష్ప-2'​కు నక్సలైట్ల భయం!.. ఛత్తీస్​గఢ్​ టు ఒడిశా.. షూటింగ్​ షిఫ్ట్!! - పుష్ప 2 సినిమా షూటింగ్ ఛత్తీస్​గఢ్​లో తాజా

Pushpa-2 Shooting : నక్సలైట్ల భయంతో పుష్ప-2 సినిమా షూటింగ్​ స్పాట్​ను దర్శకనిర్మాతలు మార్చేశారు. ఛత్తీస్​గఢ్​లోని సుక్మా​ అడవుల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిద్దామనుకున్న మూవీ యూనిట్.. ఒడిశాలోని మల్కన్​గిరి అటవీ ప్రాంతానికి మకాం మార్చింది.

The film Pushpa-2 is being shot in the forests of Malkangiri in Odisha
పుష్ప-2ను వెంటాడిన భయం.. దెబ్బకు షూటింగ్​ స్పాట్​ మకాం మార్చిన నిర్మాతలు!
author img

By

Published : May 14, 2023, 10:22 PM IST

Updated : May 14, 2023, 10:55 PM IST

Pushpa 2 Shooting : ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్​ నటిస్తున్న ​పుష్ప-2కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్​లోని కొంత భాగాన్ని ఛత్తీస్​గఢ్​లోని అడవుల్లో చిత్రీకరణ చేసేందుకు షెడ్యూల్​ ఖరారు కాగా.. అక్కడ నక్సలైట్ల భయం ఉండటం వల్ల ఆ షూటింగ్​ లోకేషన్​​ను పక్క రాష్ట్రమైన ఒడిశాలోని అడవుల్లో ప్లాన్​ చేశారు మూవీ మేకర్స్.

ముందుజాగ్రత్తగా లొకేషన్​ మార్పు!
ముందుగా ఛత్తీస్​గడ్​లోని సుక్మా అడవుల్లో సినిమా షూటింగ్​ షెడ్యూల్​ను నిర్ణయించింది పుష్ప-2 చిత్ర బృందం. కానీ అక్కడ నక్సలైట్లు బెడద కారణంగా ముందుజాగ్రత్తగా ఆ నిర్ణయాన్ని నిర్మాతలు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. దీంతో సురక్షితమైన అడవి ప్రాంతంలో చిత్రీకరణ చేసేందుకు మంచి లొకేషన్​ స్పాట్​ను వెతుకుతున్న క్రమంలో ఒడిశాలోని మల్కన్‌గిరి అడవులు నచ్చడం వల్ల సినిమా షూటింగ్​ స్థలాన్ని అక్కడకు మార్చారు దర్శకనిర్మాతలు. ప్రస్తుతం ఈ అడవుల్లో సినిమా షూటింగ్​ ప్రశాంతంగా సాగుతోంది.

The film Pushpa-2 is being shot in the forests of Malkangiri in Odisha
దర్శకుడు సుకుమార్​తో బన్నీ

ఇందులో తెలంగాణకు చెందిన సుమారు 200 మంది పాల్గొంటున్నారు. షూటింగ్ 20 రోజుల పాటు జరగనుంది. అయితే చిత్రీకరణ​ జరిగే ప్రాంతం చుట్టూ దట్టమైన అడవులు ఉండడమే కాకుండా నక్సలైట్లు ఎక్కువగా సంచరించే ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం బార్డర్​ కావడం వల్ల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేసుకుంది చిత్ర యూనిట్​. సినిమా సెట్​ను రూపొందిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని సన్నివేశాలను మల్కన్‌గిరిలోని వివిధ పర్యటక ప్రదేశాల్లో చిత్రీకరిస్తున్నారు.

2022లో వచ్చిన పుష్ప మూవీలోని 'తగ్గేదేలే' డైలాగ్​ ఎంతలా పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేగాక ఈ సినిమా వివిధ భాషల్లోనూ బ్లాక్​బస్టర్​ విజయాన్ని సాధించింది. ఇదే ఉత్సాహంతో దీనికి సీక్వెల్​గా పుష్ప-2 రాబోతోంది. మొదటి భాగం కంటే దీటుగా సినిమా రెండో భాగాన్ని తెరకెక్కిస్తోంది మూవీ టీమ్​.

ఇతర నిర్మాతలనూ..
ఛత్తీస్​గఢ్​​.. బస్తర్​ జిల్లాలోని అడవులు సినిమాలకు నెలవుగా ఉండేవి. వీటిని సినిమా షూటింగ్​ల కోసం వినియోగిస్తుంటారు. అంతేగాక పర్యటకులకు ఇదొక రిఫ్రెష్​మెంట్​ స్పాట్​గా ఉండేది. కానీ నక్సలైట్ల ప్రభావంతో ఇప్పుడు ఈ ప్రాంతానికి పర్యటకులు రాక కూడా తగ్గింది. మరోవైపు వీరి భయంతో జరగరానిది ఏదైనా జరుగుతుందేమోనన్న కారణంతో ఇతర సినిమాల నిర్మాతలు కూడా ఈ ప్రాంతంలోని షూటింగ్ స్పాట్​లను రద్దు చేసుకుంటున్నారట.

బాహుబలినీ వెంటాడింది!
ఆల్​ టైమ్​ బ్లాక్ బస్టర్​గా నిలిచిన బాహుబలి చిత్రాన్ని కూడా ముందుగా దంతేవాడలోని ప్రసిద్ధ జలపాతం హంద్వారాలో తీయాలనుకున్నారు. కానీ నక్సలైట్ల భయంతో ప్రొడక్షన్ టీమ్ ఈ స్పాట్​లో షూటింగ్​ వద్దనుకుంది. దీంతో సినిమాలోని కొన్ని సీన్స్​కు హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికైంది.

Last Updated : May 14, 2023, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.