Pune Youth Murder: మహారాష్ట్ర పుణెలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ద్విచక్రవాహనానికి దారి ఇవ్వలేదని ఓ వ్యక్తిని దారుణంగా కొట్టిచంపారు దుండగులు. కేసుకు సంబంధించి ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముల్శీ తాలుకా ఆంద్గావ్లో ఆదివారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మావల్ తాలుకా తుంగీ ప్రాంతానికి చెందిన సుభాష్ విఠల్ వాఘ్మారే (38) ముంబయి అంధేరీలో ప్రైవేట్ లగ్జరీ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మే 6న తన అత్త చనిపోగా.. సుభాష్ లోనావ్లాకు వచ్చాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం వారిని కలిసేందుకు దగ్గరి బంధువు రాజేశ్ అంకుష్ కుమార్‌తో కలిసి ఆంద్గావ్కు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఉర్వడే- లవాసా రహదారి వద్ద రాజేంద్ర జగన్నాథ్ మోహోల్ అనే వ్యక్తి.. సుభాష్ బైక్‌ను ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. కోపంతో ఊగిపోయిన రాజేంద్ర.. వేగంగా సుభాష్‌ను ఛేజ్ చేసి అతడి బైక్ కీ లాక్కున్నాడు. ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది. రాజేంద్ర మోహోల్ తన ఇద్దరు స్నేహితులు సంగ్రామ్ సురేశ్ మోహోల్, సమీర్ దీపక్ కర్పేకు ఫోన్ చేసి రప్పించాడు. ముగ్గురు కలిసి ఆ వ్యక్తిపై దాడి చేశారు. కాళ్లతో తన్ని, కర్రలతో విరుచుకుపడగా.. సుభాష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఇవీ చూడండి: 'షవర్మా'పై బ్యాన్.. మేయర్ ఆదేశాలు.. త్వరలో మరిన్ని నగరాల్లోనూ..!
బెడ్‌షీట్‌పై 'పీరియడ్స్' మరకలు.. హోటల్ యాజమాన్యం పనికి ప్రొఫెసర్ షాక్!