ETV Bharat / bharat

స్నేహితుడిని కలిసేందుకు దుబాయ్​ వెళ్లి.. ఎమ్మెల్యే హఠాన్మరణం - రమేశ్​ లట్కే హఠాన్మరణం

MLA Ramesh Latke: శివసేన శాసనసభ్యుడు రమేశ్​ లట్కే మరణించారు. హార్ట్​ ఎటాక్​తో బుధవారం రాత్రి దుబాయ్​లో చనిపోయినట్లు మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్​ పరబ్​ తెలిపారు.

Shiv Sena MLA Ramesh Latke dies of heart attack in Dubai

author img

By

Published : May 12, 2022, 8:06 AM IST

MLA Ramesh Latke: మహారాష్ట్ర శాసనసభ్యుడు, శివసేన నేత రమేశ్​ లట్కే హఠాన్మరణం చెందారు. అంధేరీ తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రమేశ్.​. దుబాయ్​లో ఉన్న తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లినట్లు రాష్ట్ర రవాణా మంత్రి అనిల్​ పరబ్​ తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారని పేర్కొన్నారు. లట్కే కుటుంబసమేతంగా దుబాయ్​ వెళ్లారని.. వారిని భారత్​ రప్పించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు అనిల్​.

Shiv Sena MLA Ramesh Latke dies of heart attack in Dubai
శివసేన ఎమ్మెల్యే రమేశ్​ లట్కే
2014లో కాంగ్రెస్​ అభ్యర్థి సురేశ్​ షెట్టిని ఓడించి.. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు లట్కే. 2019లో స్వతంత్ర అభ్యర్థి ఎం. పటేల్​పై ఘనవిజయం సాధించారు. అంతకుముందు బృహన్​ ముంబయి మునిసిపల్​ కార్పొరేషన్​కు(బీఎంసీ) కార్పొరేటర్​గా కూడా పనిచేశారు

ఇవీ చూడండి: కూతురి కోసం 30ఏళ్ల పాటు 'మగాడి'లా మారిన తల్లి

22 కుక్కలు ఉన్న గదిలో బాలుడు బందీ.. రెండేళ్లుగా నరకం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.