ETV Bharat / bharat

'ఔరంగజేబ్ సమాధిని హైదరాబాద్​కు మార్చండి'.. మజ్లిస్​కు శివసేన కౌంటర్ - ఔరంగజేబ్ సమాధి మార్పు

శివసేన శాసనసభ్యుడు సంజయ్​ శిర్​సఠ్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీ నగర్​లో ఉన్న మొఘల్​ రాజు ఔరంగజేబ్​ సమాధిని హైదరాబాద్​కు తరలించాలని డిమాండ్ చేశారు.

auranzeb grave should be shifted to hyderabad

author img

By

Published : Mar 6, 2023, 1:54 PM IST

Updated : Mar 6, 2023, 2:30 PM IST

మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీ నగర్​లో ఉన్న మొఘల్​ రాజు ఔరంగజేబ్​ సమాధిని హైదరాబాద్​కు తరలించాలని డిమాండ్ చేశారు శివసేన శాసనసభ్యుడు సంజయ్​ శిర్​సఠ్​. ఇటీవలే ఔరంగాబాద్​గా ఉన్న పేరును 'ఛత్రపతి శంభాజీ నగర్'​గా మార్చింది ప్రభుత్వం. దీనిని వ్యతిరేకిస్తూ శనివారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టింది మజ్లిస్ పార్టీ. AIMIM పార్టీ చేపట్టిన నిరసనలపై సోమవారం మాట్లాడిన సంజయ్.. ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఔరంగజేబ్​పై వారికి అంత ప్రేమ ఉంటే ఆయన సమాధిని హైదరాబాద్​కు తరలించుకోండి. అక్కడ ఆయన స్మారకాన్ని వారికి ఇష్టం వచ్చినట్లు నిర్మించుకోండి. ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ నిరసనలు చేయొద్దు. వెంటనే నిలిపివేయాలి."

--సంజయ్​ శిర్​సఠ్, శివసేన శాసనసభ్యుడు

సంజయ్​ వ్యాఖ్యలను ఖండించిన AIMIM
శివసేన శాసనసభ్యుడు సంజయ్​ శిర్​సఠ్ చేసిన డిమాండ్​ను AIMIM వ్యతిరేకించింది. వారి రాజకీయాల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు AIMIM లోకల్ ప్రెసిడెంట్ షరీఖ్​. వారికి ఔరంగజేబ్​పై అంత కోపం ఉంటే.. జీ20 ప్రతినిధులను ఆయన భార్య రబియా సమాధికి ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు గత పాలకులపై అంత కోపం ఉంటే.. వారు నిర్మించిన తాజ్​మహల్ లాంటి ప్రదేశాలపై ఎందుకు ఆదాయాన్ని అర్జిస్తోందంటూ కౌంటర్​ వేశారు. భాజపా, దాని మిత్రపక్షాలకు ప్రజల్లోకి వెళ్లేందుకు ఎలాంటి మార్గాలు లేనందునే.. ఇలా వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

పేర్ల మార్పునకు ఓకే చెప్పిన కేంద్రం
ఔరంగాబాద్​ పేరును 'ఛత్రపతి శంభాజీనగర్​', ఉస్మానాబాద్​ను 'ధారాశివ్'​గా మార్చాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో గత నెల రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి అంగీకారం తెలిపింది కేంద్రం. అయితే ఈ నిర్ణయాన్ని AIMIM తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కానీ కాంగ్రెస్​, ఉద్ధవ్ శివసేన వర్గం, ఎన్​సీపీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ముంబయి, పుణె పేర్లు మార్చాలని AIMIM డిమాండ్
ఔరంగాబాద్​, ఉస్మానాబాద్​ పేర్ల మార్పుపై గతవారం స్పందించిన AIMIM నేతలు.. ముంబయి, పుణె, నాగ్​పుర్​, కొల్హాపుర్ నగరాల పేర్లు కూడా మార్చాలని డిమాండ్ చేశారు. ఆ నగరాలకు మహనీయుల పేర్లు పెట్టాలని సూచించారు. ముంబయికి ఛత్రపతి రాజే మహానగర్​, పుణెకు జ్యోతిబా పులే నగర్​, నాగ్​పుర్​కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్​ నగర్​, కొల్హాపుర్​కు ఛత్రపతి సాహు మహారాజ్​నగర్​గా పేర్లు పెట్టాలని కోరారు.

ఇవీ చదవండి : ఆ లింకులు క్లిక్ చేసిన టీవీ నటి.. ఖాతా నుంచి డబ్బు మాయం.. మరో 40మంది సైతం..

భార్యపై అనుమానంతో హత్య.. 2 నెలలుగా వాటర్ ట్యాంక్​లోనే శరీర భాగాలు.. మరో కేసుతో బయటకు..

Last Updated : Mar 6, 2023, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.