ETV Bharat / bharat

'ఆధార్ జిరాక్స్' సూచనలపై కేంద్రం యూటర్న్.. మళ్లీ ఏమైందంటే? - ఆధార్ జిరాక్స్ నిబంధనలు

Aadhaar xerox advisory: ఆధార్ కార్డు ఫొటోకాపీ ఇతరులతో పంచుకోవడంపై చేసిన కీలక సూచనలను కేంద్రం వెనక్కి తీసుకుంది. ఆధార్ జిరాక్స్ కాపీని అవసరమైన చోట మాత్రమే సమర్పించాలని ఇదివరకు సూచించగా.. తాజాగా ఈ ప్రకటనను ఉపసంహరించుకుంది. అసలు ఏమైందంటే?

masked aadhaar
'వారికి ఆధార్ జిరాక్స్​ కాపీ ఇవ్వొద్దు'.. కేంద్రం వార్నింగ్
author img

By

Published : May 29, 2022, 1:25 PM IST

Updated : May 29, 2022, 4:17 PM IST

Aadhaar advisory withdraw: ఆధార్ ఫొటోకాపీ(జిరాక్స్)ని ఇతరులతో పంచుకునే విషయంపై జారీ చేసిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇవి తప్పుడు అర్థాలకు దారితీసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

"ఆధార్ ఫొటోకాపీని దుర్వినియోగం చేస్తారన్న ఉద్దేశంతోనే ఏ ఇతర సంస్థలతో పంచుకోవద్దని మార్గదర్శకాలు జారీ చేశాం. ప్రత్యామ్నాయంగా, చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే ఆధార్​ కార్డు ఉపయోగించాలని సూచించాం. అయితే, ఇది అపార్థాలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి.. ఈ ప్రకటనను ఇప్పుడే ఉపసంహరించుకుంటున్నాం."
-కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ

గుర్తింపు, గోప్యతను కాపాడేందుకు ఆధార్ ఆథెంటికేషన్ వ్యవస్థలో అన్ని రకాల ముందుజాగ్రత్త ఫీచర్లు ఉన్నాయని మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా పేర్కొంది. ఆధార్ నెంబర్​ను షేర్ చేసే విషయంలో సాధారణ అప్రమత్తతతో ఉండాలని మాత్రమే తాము సూచిస్తున్నట్లు వివరణ ఇచ్చింది.

Aadhaar new rules: కాగా, ఆధార్ కార్డుపై ప్రభుత్వం పౌరులను అప్రమత్తం చేస్తూ ఆదివారం కీలక సూచనలు జారీ చేసింది. అవసరమైన చోట మాత్రమే పూర్తి ఆధార్‌ నంబరు ఉన్న కార్డు ఫొటోకాపీని ఇవ్వాలని సూచించింది. అవసరం లేని దగ్గర మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డుని ఇవ్వాలని కోరింది. హోటల్స్‌, సినిమాహాళ్ల వంటి ప్రదేశాల్లో ఆధార్‌కార్డు జిరాక్స్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. యూఐడీఏఐ అనుమతి ఉన్న సంస్థలు మాత్రమే ఆధార్‌ను ధ్రువీకరణ కోసం ఉపయోగించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొన్ని గంటలకే ఈ ప్రకటనను ఉపసంహరించుకుంది.

What is Masked Aadhaar: 12 అంకెల బదులు చివరి 4 అంకెలు మాత్రమే కనిపించి ఉండే ఆధార్‌ పత్రమే ఈ మాస్క్‌డ్‌ ఆధార్‌. దీనిపై మీ ఫొటో, క్యూఆర్‌ కోడ్‌, మీ చిరునామా ఇతర వివరాలు యథావిధిగా ఉంటాయి. ఎవరికైనా ఓ గుర్తింపు పత్రంలా ఆధార్‌ ఇవ్వాలనుకుంటే ఈ మాస్క్‌డ్‌ ఆధార్‌ ఉపయోగపడుతుంది. ఆధార్‌ నంబర్‌ పూర్తిగా అవసరం లేని చోట, ఇ-కేవైసీకి దీన్ని వినియోగించొచ్చు.

Masked aadhaar card download: మాస్క్‌డ్‌ ఆధార్‌ను ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి...

  • UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి 'డౌన్‌లోడ్‌ ఆధార్‌' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • ఆధార్‌ నంబర్‌/ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ/ వర్చువల్‌ ఐడీ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.
  • ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేముందు అక్కడ ఉన్న 'మాస్క్‌డ్‌ ఆధార్‌' టిక్‌బాక్స్‌ను ఓకే చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి.
  • ఆ తర్వాత 'సెండ్‌ ఓటీపీ' బటన్‌పై క్లిక్‌ చేయాలి. ఆధార్‌తో జత చేసిన మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాలి. తర్వాత డౌన్‌లోడ్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఆ తర్వాత మీకు పీడీఎఫ్‌ రూపంలో ఆధార్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. దీనికి పాస్‌వర్డ్‌ ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ఈ-మెయిల్‌ ద్వారా వస్తాయి.

ఇదీ చదవండి:

Last Updated : May 29, 2022, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.