ETV Bharat / bharat

మంచూరియా, ఫ్రైడ్ రైస్ ఆశ చూపి బాలికపై రేప్! - ఛత్తీస్​గఢ్​లో బాలికపై సామూహిక అత్యాచారం

వీధుల్లో యాచించుకుని బతికే బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ కిరాతుకుడు. ఈ ఘటన కర్ణాటక ధార్వాడ్​లో జరిగింది. కాగా.. ఛత్తీస్​గఢ్​లో ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు కామాంధులు.

rape on beggar
యాచకురాలిపై అఘాయిత్యం
author img

By

Published : Sep 23, 2021, 3:33 PM IST

ఆహారం, డబ్బు ఆశ చూపి 14 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. కర్ణాటక ధార్వాడ్​ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై జిల్లా బాలల రక్షణ విభాగం(డీసీపీయూ) కేసు నమోదు చేసింది.

ఇదీ జరిగింది

ధార్వాడ్​ నగర పరిసర ప్రాంతాల్లో యాచించుకుని జీవించే 14 ఏళ్ల బాలికకు.. మంచూరియా, ఎగ్​ఫ్రైడ్​ రైస్​ తినిపిస్తానని ఓ కిరాతకుడు ఆశ చూపించాడు. అతడ్ని నమ్మి వెళ్లిన ఆ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో బాలిక గురించి డీసీపీయూకు.. పోలీసులు సమాచారం అందించారు. ఈ సమాచారం ఆధారంగా బాధితురాలిని గుర్తించిన డీసీపీయూ.. నవనగర్‌లోని స్నేహా ఓపెన్​ షెల్టర్​కు చేర్చారు. అనంతరం బాలికతో మాట్లాడి.. ఆమె లైంగిక వేధింపులకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయమై కేసు నమోదు చేశారు.

ఛత్తీస్​గఢ్​లో బాలికపై సామూహిక అత్యాచారం

ఛత్తీస్​గఢ్​ బలరామ్​పుర్​లో ఓ మైనర్​​పై ఐదుగురు కిరాతుకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఏమైందంటే..?

సెప్టెంబరు 19న తన గ్రామంలో జరిగిన గణేశ్​ నిమజ్జన కార్యక్రమం చూడటానికి స్నేహితురాలితో కలిసి బయటకు వెళ్లింది ఓ బాలిక. కార్యక్రమం ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో ఆ బాలిక ఫ్రెండ్​.. మరో అబ్బాయితో కలిసి బయటకు వెళ్తూ.. తాను వచ్చేవరకు ఊరు శివారులో ఉండమని చెప్పింది. ఇదే సమయంలో ఒంటరిగా ఉన్న బాలికను గుర్తించిన ఓ నిందితుడు పక్కనే ఉన్న పొలంలోకి బలవంతంగా లాక్కెళ్లాడు. అక్కడే ఉన్న మరో నలుగురు కలిసి బాలికపై సామూహిక అత్యాచారం చేసి.. పారిపోయారు.

అయితే అదే దారిలో వెళ్తున్న తన తండ్రి స్నేహితుడి సాయంతో ఇంటికి చేరుకున్న బాలిక.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కుటుంబ సభ్యుల.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురుని అరెస్టు చేసిన పోలీసులు.. ఐదో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: దారుణం.. బాలికపై 30మంది సామూహిక అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.