ETV Bharat / bharat

మహిళ అలాంటి దుస్తులు ధరిస్తే లైంగిక వేధింపుల సెక్షన్ వర్తించదు - లైంగిక వేధింపులు న్యాయస్థానం న్యూస్

మహిళ రెచ్చగొట్టేలా దుస్తులు వేసుకున్నప్పుడు.. లైంగిక వేధింపుల సెక్షన్ వర్తించదంటూ కేరళలోని ఓ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఫిర్యాదు చేయాలంటే మహిళ గౌరవ, మర్యాదలకు భంగం కలిగిందనేందుకు తగిన ఆధారాలు ఉండాలని చెప్పుకొచ్చింది. మరోవైపు, భార్యను మరో మహిళతో పోల్చుతూ, ఇతరుల్లా ఉండాలని ఆమెపై భర్త ఒత్తిడి చేయడం మానసిక క్రూరత్వం కిందకు వస్తుందని కేరళ హైకోర్టు పేర్కొంది.

Sexual assault case
Sexual assault case
author img

By

Published : Aug 17, 2022, 6:17 PM IST

Court on sexual harassment: లైంగిక వేధింపుల విషయంలో కేరళ, కోజికోడ్​లోని ఓ సెషన్స్ కోర్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. మహిళ రెచ్చగొట్టేలా దుస్తులు వేసుకున్నప్పుడు.. భారత శిక్షా స్మృతి సెక్షన్ 354-ఏ (లైంగిక వేధింపులు) వర్తించదని పేర్కొంది. సివిక్ చంద్రన్ అనే కార్యకర్త ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా నిందితుడి వయసును ప్రస్తావించింది. 'ఒకవేళ భౌతికంగా తాకినా, శారీరక పరిమితులు ఉన్న 74ఏళ్ల వ్యక్తి ఫిర్యాదుదారును ఒడిలో బలవంతంగా కూర్చోబెట్టుకుంటారని అనుకోవడం నమ్మే విధంగా లేద'ని పేర్కొంది.

'నిందితుడు సమర్పించిన ఫొటోలు చూస్తే ఫిర్యాదుదారు రెచ్చగొట్టేవిధంగా ఉన్న దుస్తులను ధరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందువల్ల నిందితుడికి సెక్షన్ 354 ఏ వర్తించదు' అని కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎస్ కృష్ణకుమార్ పేర్కొన్నారు. ఫిర్యాదు చేయాలంటే మహిళ గౌరవ, మర్యాదలకు భంగం కలిగిందనేందుకు తగిన ఆధారాలు ఉండాలని చెప్పారు.

కేసు ఏంటంటే?
2020 ఫిబ్రవరిలో నిందితుడు కొందరితో కలిసి కొయిలాని ప్రాంతంలోని నంది బీచ్ వద్ద ఓ క్యాంపు ఏర్పాటు చేశాడు. ఈ క్యాంపులో ఫిర్యాదు చేసిన మహిళ సైతం పాల్గొన్నారు. క్యాంపులోని వ్యక్తులందరూ సరదాగా చుట్టూ తిరిగేందుకు వెళ్లగా.. ఫిర్యాదుదారును నిందితుడు చెయ్యి పట్టుకొని లాగాడు. అనంతరం, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. రహస్య భాగాలపై చేతులు వేసేందుకు ఒడిలో కూర్చోవాలని కోరాడు. ఈ నేపథ్యంలో ఐపీసీ సెక్షన్ 354 ఏ(2), 341, 354 ప్రకారం చర్యలు తీసుకోవాలని మహిళ ఫిర్యాదు చేశారు.

అయితే, ఈ కేసులో తనకు బెయిల్ ఇప్పించాలని నిందితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ బెయిల్ అభ్యర్థనను బాధితురాలి తరఫున వాదనలు వినిపిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకించారు. గతంలోనూ నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని న్యాయస్థానం ముందు ప్రస్తావించారు. నిందితుడిపై మరో లైంగిక వేధింపుల కేసు కొనసాగుతోంది. ఓ దళిత మహిళపై వేధింపులకు యత్నించిన కేసులో అతడికి ఆగస్టు 12న బెయిల్ లభించింది.

'అది మానసిక క్రూరత్వమే'
మరోవైపు, భార్యను మరో మహిళతో పోల్చుతూ, వారిలా ఉండాలని ఆమెపై భర్త ఒత్తిడి చేయడం మానసిక క్రూరత్వం కిందకు వస్తుందని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి ప్రవర్తనను మహిళలు సహిస్తారని అనుకోలేమని పేర్కొంది.

అసలేమైందంటే?
కేసులో భాగమైన దంపతులకు 2009 జనవరిలో వివాహం జరిగింది. నెల రోజుల పాటు కలిసి ఉన్నారు. ఆ తర్వాత నుంచి వేర్వేరుగా జీవిస్తున్నారు. అదే ఏడాది నవంబర్​లో వివాహం రద్దు చేయాలని మహిళ.. కోర్టును ఆశ్రయించింది. దీంతో ఫ్యామిలీ కోర్టు దంపతుల వివాహాన్ని రద్దు చేసింది. వివాహానికి పరిపూర్ణత లేదన్న కారణంతో ఈ ఆదేశాలు జారీ చేసింది.

వీటిని సవాల్ చేస్తూ భర్త.. హైకోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ అతడికి చుక్కెదురైంది. కుటుంబ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. అయితే, వివాహానికి పరిపూర్ణత లభించలేదన్న కారణం అవసరం లేదని.. 1869 విడాకుల చట్టం ప్రకారం భర్త మానసిక క్రూరత్వానికి పాల్పడితే వివాహం దానికదే రద్దు అవుతుందని స్పష్టం చేసింది.

"ప్రతివాది(భర్త)కి పిటిషనర్(భార్య) శారీరకంగా ఆకర్షణీయంగా అనిపించలేదు. వైవాహిక బంధంలో ఎలా ఉండాలో చెబుతూ భార్యకు ఈమెయిల్స్ పంపించారు. భార్యను మరో మహిళతో పోల్చి, వారిలా ఉండాలని ఆమెపై భర్త ఒత్తిడి చేయడం మానసిక క్రూరత్వమే. వీటన్నింటినీ మహిళలు భరిస్తారని అనుకోవడం సరికాదు. ఈ కేసులో దంపతులు నెల రోజులకు మించి కలిసి ఉండలేదు. వీరి వివాహం పరిపూర్ణం అయినట్లు ఆధారాలు లేవు. పరిపూర్ణం చేసుకోవాలని దంపతులు భావించడం లేదు. ఇద్దరి మధ్య భావోద్వేగాలు లేవు. ఏదో నామమాత్రంగా వివాహం జరిగింది. దీన్ని కొనసాగించడం నైతికంగా భావ్యం కాదు" అని కేరళ హైకోర్టు పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.