ETV Bharat / bharat

విషాదం.. ఇంటి గోడ కూలి 13 మంది దుర్మరణం - లఖ్​నవూ వార్తలు

SEVERAL DIED DUE TO COLLAPSE OF UNDER CONSTRUCTION WALL IN LUCKNOW UP

author img

By

Published : Sep 16, 2022, 8:36 AM IST

Updated : Sep 16, 2022, 3:54 PM IST

08:35 September 16

విషాదం.. ఇంటి గోడ కూలి 13 మంది దుర్మరణం

Wall Collapsed In Lucknow : ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో విషాదం నెలకొంది. దిల్​కుషా​ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు సహా 13 మంది మృతి చెందారు. పది మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే గురువారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురువడం వల్లే గోడ కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. ఆ గోడ పక్కనే ఉన్న గుడిసెల్లో నివసిస్తున్న తొమ్మిది మంది బలయ్యారని తెలిపారు.

మరోవైపు, ఉన్నావ్‌ జిల్లాలో కురిసిన వర్షాలకు ఓ ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మరణించారు. ఈ దుర్ఘటనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ఘటనపై లఖ్‌నవూ పార్లమెంట్‌ సభ్యుడు, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

యూపీతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లోనూ వర్షాలు ముంచెత్తాయి. వర్షాల కారణంగా యూపీలో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అటు ముంబయిలోనూ జోరు వానలు కురుస్తున్నాయి.

Last Updated : Sep 16, 2022, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.