ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం- ఏడుగురు మృతి - Madhya Pradesh accident news updates

దేశంలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో 11మంది మరణించారు. మధ్యప్రదేశ్​లో ట్రక్కు​, కారు ఢీ కొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లో కారు బోల్తా పడి నలుగురు మృతి చెందారు.

Seven people killed, five injured in a collision between a car and dumper truck in Satna
మధ్యప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం- ఏడుగురు మృతి
author img

By

Published : Nov 9, 2020, 9:47 AM IST

Updated : Nov 9, 2020, 10:16 AM IST

మధ్యప్రదేశ్​ సత్నా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఉత్తర్ ప్రదేశ్​లో కారు బోల్తా..

ఉత్తర్​ప్రదేశ్ బాగ్​పాత్​ జిల్లా​లో ఆదివారం రాత్రి ఓ కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతులను ధర్మేంద్ర, కపిల్​, నరేశ్​ ప్రమోద్​లుగా గుర్తించారు అధికారులు. వీరిలో కపిల్​, ధర్మేంద్ర సోదరులని తెలిపారు.

వివాహ వేడుకకు హాజరై తిరుగు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా... అప్పటికే నలుగురూ మరణించారు. డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: దేశంలో మరో 45,903 మందికి కరోనా

Last Updated : Nov 9, 2020, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.