ETV Bharat / bharat

ప్రతికూల వాతావరణంలోనూ గురి తప్పని 'ఆకాశ్​' - క్షిపణి ప్రయోగాలు

కొత్త తరం ఆకాశ్​ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది భారత్​. ప్రతికూల వాతావరణంలోనూ లక్ష్యాన్ని గురి తప్పకుండా ఛేదించినట్లు డీఆర్​డీఓ ప్రకటించింది. రెండు రోజుల వ్యవధిలోనే ఇది రెండో పరీక్ష.

Akash-NG Missile
ప్రతికూల వాతవరణంలోనూ గురి తప్పని 'ఆకాశ్​'
author img

By

Published : Jul 23, 2021, 4:05 PM IST

దేశీయంగా అభివృద్ధి చేసిన కొత్త తరం ఆకాశ్ క్షిపణిని(ఆకాశ్​-ఎన్​జీ) భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. రెండు రోజుల వ్యవధిలో ఆకాశ్‌కు ఇది రెండో పరీక్ష కాగా ఈసారి ప్రతికూల వాతావరణంలో క్షిపణి నిర్దేశిత పనితీరు కనబరిచినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్​డీఓ) పేర్కొంది. ఒడిశా బాలేశ్వర్​లోని ఇంటిగ్రేడెట్​ టెస్ట్​ రేంజ్​లో ఈ పరీక్షలు చేపట్టారు.

Akash-NG Missile
దూసుకెళ్తోన్న ఆకాశ్​ క్షిపణి

గగనతలంలో వేగంగా దూసుకెళ్తున్న మానవరహిత లోహ విహంగాన్ని ఆకాశ్ గురి తప్పకుండా ఛేదించిందని డీఆర్​డీఓ తెలిపింది.

ఉపరితలం నుంచి గగనతలంలో 30 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఆకాశ్‌ సొంతం. నేటి పరీక్షలో లాంచర్, రాడర్‌, కమాండ్ అండ్‌ కంట్రోల్‌తో పాటు పూర్తి ఆయుధ వ్యవస్థ పనితీరును సమీక్షించినట్లు డీఆర్​డీఓ వివరించింది.

ఇదీ చూడండి: 'యాంటీ ట్యాంక్​ గైడెడ్​​ మిసైల్​' ప్రయోగం విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.