ETV Bharat / bharat

సమయం దాటినా రెండో డోసు తీసుకోని వారు 11 కోట్ల పైనే.. - health ministry latest news

దేశంలో దాదాపు 11 కోట్ల మంది కరోనా టీకా రెండో డోసు తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఈ విషయంపై అన్ని రాష్ట్రల ఆరోగ్య కార్యదర్శలతో కేంద్ర ఆరోగ్యమంత్రి మన్​సుఖ్ మాండవీయ చర్చించారు. త్వరలో హర్ ఘర్ దస్తక్ పేరుతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించి ప్రతి ఇంటికి తిరిగి టీకాలు వేయనున్నట్లు తెలిపారు.

Second dose of Covid vaccine overdue for over 11 crore people, shows Govt data
రెండో డోసు తీసుకోని 11కోట్లమంది
author img

By

Published : Oct 27, 2021, 9:44 PM IST

కరోనా టీకా తొలి డోసు తీసుకుని.. రెండో డోసు తీసుకోని వారు దాదాపు 11కోట్ల మంది ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. వీరంతా సమయం దాటిపోయినా టీకా తీసుకోవడం లేదని తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్యమంత్రి మన్​సుఖ్ మాండవీయ ఈ విషయంపై చర్చించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వీరందరికీ టీకాలు ఇచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించినట్లు పేర్కొన్నాయి.

దేశంలో కరోనా టీకాకు అర్హులైన 94 కోట్ల మందిలో 76 శాతం మంది కనీసం ఒక్క డోసు టీకా వేసుకున్నారు. 32 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి.

టీకా కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు త్వరలోనే హర్ ఘర్ దస్తక్ పేరుతో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్​ను నిర్వహించనున్నట్లు మాండవీయ వెల్లడించారు. ఆరోగ్య కార్యకర్తలంతా ప్రతి ఇల్లు తిరిగి టీకా అసలు తీసుకోని వారికి, రెండో డోసు తీసుకోవాల్సిన వారికి వ్యాక్సిన్ వేయనున్నట్లు చెప్పారు. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం సాగనున్నట్లు వివరించారు. దేశంలో వ్యాక్సినేషన్ 50శాతం కూడా కానీ జిల్లాలు 48 ఉన్నాయని, ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: 'పెగసస్​' హ్యాకింగ్​ గుట్టు తేల్చేది ఈ ముగ్గురే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.