ETV Bharat / bharat

బాణసంచా నిషేధంపై హైకోర్టు ఆదేశాలు కొట్టేసిన సుప్రీం

దీపావళి, కాళీ పూజ, ఇతర పండగల్లో బాణసంచా పూర్తిగా నిషేధిస్తూ(firecracker ban in india) కోల్​కతా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

SC sets aside HC order banning firecrackers in West Bengal during upcoming festivals
బాణసంచా నిషేధంపై హైకోర్టు ఆదేశాలు పక్కనబెట్టిన సుప్రీం
author img

By

Published : Nov 1, 2021, 4:36 PM IST

Updated : Nov 1, 2021, 5:03 PM IST

బాణసంచాను ఈ ఏడాది పూర్తిగా నిషేధించాలని(firecracker ban in india) కోల్​కతా​ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. టపాసులను రాష్ట్రంలోకి దిగుమతి చేసుకోకుండా ప్రవేశమార్గాల వద్దే నిలువరించేలా చర్యలు చేపట్టేందుకు బంగాల్ ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించింది. జస్టిస్ ఏఎం ఖన్విల్కర్​, జస్టిస్​ అజయ్ రస్తోగితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.

దీపావళి, కాళీ పూజ, ఛఠ్​ పూజ, జగధాత్రి పూజ, గురునానక్​ జయంతి వంటి ఉత్సవాల్లో బాణసంచా కాల్చకుండా నిషేధం విధిస్తూ(firecrackers ban ) అక్టోబర్​ 29న ఆదేశాలిచ్చింది కోల్​కతా హైకోర్టు. కరోనా నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మైనపు, నూనె దివ్వెలను మాత్రం వెలిగించుకోవచ్చని చెప్పింది. ఈ ఆదేశాలను సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​ను సుప్రీం ధర్మాసనం సోమవారం విచారించింది.

మరోవైపు... బేరియం లవణాలు ఉన్న బాణసంచాపై ఇటీవలే నిషేధం విధించింది సుప్రీంకోర్టు(sc ban on firecrackers). ఉత్సవాల పేరుతో ఇతరుల ప్రాణాలకు హాని తలపెడితే వారి హక్కుకు భంగం కల్గించినట్లే పేర్కొంది. హరిత టపాసులకు మాత్రం అభ్యంతరం లేదని చెప్పింది.

ఇదీ చదవండి: బాణసంచా నిషేధంపై సుప్రీం క్లారిటీ- ఆ టపాసులకు ఓకే..

Last Updated : Nov 1, 2021, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.