ETV Bharat / bharat

'ఆ వార్తలు నిజమైతే.. 'పెగసస్​'ను  తీవ్రంగా పరిగణిస్తాం' - సీజేఐ విచారణ

దేశంలో దుమారం రేపిన పెగసస్​ వ్యవహారంపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. పెగసస్​పై వచ్చిన వార్తలు నిజమైనవైతే.. ఆరోపణలు చాలా తీవ్రమైన అంశంగానే పరిగణిస్తామన్నారు సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ. వాదనల అనంతరం ఆగస్టు 10కి విచారణ వాయిదా వేసింది.

Supreme Court
సుప్రీం కోర్టు
author img

By

Published : Aug 5, 2021, 11:54 AM IST

Updated : Aug 5, 2021, 12:25 PM IST

దేశంలో రాజకీయ దుమారానికి కారణమైన పెగసస్​ నిఘా వ్యవహారంపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులపై నిఘా పెట్టడానికి పెగసస్​ను ప్రభుత్వం ఉపయోగించిందన్న ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

" విచారణ ప్రారంభించేందుకు ముందు మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. పెగసస్​పై వస్తోన్న వార్తలు నిజమైతే.. ఆరోపణలు చాలా తీవ్రమైనవనటంలో ఎలాంటి సందేహం లేదు. 2019లోనే పెగసస్​ వెలుగులోకి వచ్చింది. దీనిపై మరింత సమాచారం పొందే ప్రయత్నం జరిగిందా? అనేది తెలియదు. కొందరు తమ ఫోన్లు హ్యాకింగ్​కు గురయ్యాయని చెబితే.. అది టెలిగ్రాఫ్​ చట్టం కిందకు వస్తుంది. ఆ ప్రకారమే ఫిర్యాదులు చేయాలి."

- ధర్మాసనం.

ప్రముఖ పాత్రికేయులు ఎన్​.రామ్​ సహా ఇతరు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు సీనియర్​ న్యాయవాది కపిల్​ సిబల్​. ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు సిబల్​. చాలా వరకు సమాచారం పొందే వీలులేదన్నారు. ఫోన్లలోకి నేరుగా ప్రవేసించిన 10 కేసులకు సంబంధించిన సమాచారం ఉందని తెలిపారు.

ప్రముఖ పాత్రికేయులు ఎన్​.రామ్​ సహా ఇతరు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించారు సీనియర్​ న్యాయవాది కపిల్​ సిబల్​. పెగసస్​ అనే చెడు సాంకేతికత మా జీవితాల్లోకి మాకే తెలియకుండా ప్రవేశించిందని కోర్టుకు తెలిపారు. అది గోప్యత, గౌరవం, గణతంత్ర విలువలపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఈ స్పైవేర్​ను కేవలం ప్రభుత్వ ఏజెన్సీలకే విక్రయించారని, ప్రైవేటు సంస్థలకు కాదని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా సంచలనంగా మారిన ఈ వ్యవహారంలో ఎన్​ఎస్​ఓ పాత్ర ఉందని తెలిపారు. ఈ స్పైవేర్​ను ఎవరు కొనుగోలు చేశారు? దాని హార్డ్​వేర్​ ఎక్కడ పెట్టారు? ఈ కేసులో ప్రభుత్వం ఎఫ్​ఐఆర్​ ఎందుకు నమోదు చేయలేదు? అనే అంశాలపై ప్రభుత్వం సమాధానమివ్వాలని కోరారు. ఈ వ్యవహారంపై స్పందించేలా.. కేంద్రానికి నోటీసులు ఇవ్వాలని సీజేఐని కోరారు సిబల్​.

వాదనల అనంతరం.. వ్యాజ్యాల కాపీలను కేంద్రానికి అందించాలని పిటిషనర్లకు సూచించింది ధర్మానసనం. అనంతరం.. విచారణను మంగళవారం (ఆగస్టు 10)కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: 'పెగసస్​' దుర్వినియోగంపై చర్యలు- ఆ దేశాలపై నిషేధం!

Last Updated : Aug 5, 2021, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.