DRDO new chairman 2022 : రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ- డీఆర్డీఓ కొత్త ఛైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శిగా నియమితులైన ఆయన.. డీఆర్డీఓ ఛైర్మన్‌గానూ వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న జి. సతీశ్ రెడ్డి రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు.
డీఆర్‌డీఓలో నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు కామత్. కామత్‌కు అరవై ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పదవిలో ఉంటారని డీఆర్డీఓ వెల్లడించింది.
దేశంలోని అగ్రశ్రేణి రక్షణ శాస్త్రవేత్తగా డాక్టర్ సతీష్ పేరొందిన వ్యక్తి. అగ్ని, పృథ్వీ, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థల కోసం నావిగేషన్, ఏవియానిక్స్ డిజైన్ రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 2018లో సతీశ్ రెడ్డి డీఆర్డీఓ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 2020లో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. ఇప్పుడు ఆ గడువు పూర్తవగా.. రక్షణ మంత్రికి సలహాదారుగా నియమించింది.
ఇదీ చదవండి: