ETV Bharat / bharat

విషమంగానే ములాయం ఆరోగ్యం.. ఆస్పత్రికి కుటుంబ సభ్యులు.. అఖిలేశ్​కు యోగి ఫోన్ - ములాయం సింగ్ న్యూస్

Mulayam Singh Yadav Health : సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్​ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ములాయం కుటుంబ సభ్యులు గురుగ్రామ్​లోని మేదాంత ఆస్పత్రికి చేరుకున్నట్లు సమాచారం. మరోవైపు ములాయం త్వరగా కోలుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆకాంక్షించారు.

Mulayam Singh Yadav
ములాయం సింగ్ యాదవ్
author img

By

Published : Oct 4, 2022, 6:42 PM IST

Updated : Oct 4, 2022, 6:55 PM IST

Mulayam Singh Yadav Health : సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్‌ యాదవ్‌ ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. హరియాణా గురుగ్రామ్​లోని మేదాంత ఆస్పత్రి ఐసీయూలో ములాయం చికిత్స పొందుతున్నారు. చికిత్సకు ఆయన శరీరం సహకరించడం లేదని, పరిస్థితి మెరుగుపడడం లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ములాయం సింగ్​.. యూరిన్ ఇన్ఫెక్షన్​, రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు హెల్త్‌ బులిటెన్‌ను సమాజ్​వాదీ పార్టీ వర్గాలు ట్విట్టర్​ ద్వారా ధ్రువీకరించాయి.

ములాయం త్వరగా కోలుకోవాలని ఎస్పీ కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు. మరోవైపు ములాయం కుటుంబ సభ్యులు గురుగ్రామ్​లోని మేదాంత ఆస్పత్రికి చేరుకున్నట్లు సమాచారం. ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. ఎస్పీ అగ్రనేత అఖిలేశ్ యాదవ్​కు ఫోన్ చేసి ములాయం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ములాయం త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు. రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ సైతం.. ములాయం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ఇవీ చదవండి: పర్వాతారోహకులపై హిమపంజా.. 10 మంది మృతి.. రంగంలోకి ఆర్మీ..

ఇద్దరిదీ ఒకే గోత్రం.. అన్నాచెల్లెల్లు అవుతారంటూ జంటను విడదీసిన పెద్దలు

Last Updated : Oct 4, 2022, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.