ETV Bharat / bharat

చిన్నారికి 'రూ.16కోట్ల' ఉచిత చికిత్స - novartis

బెంగళూరులో స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి ఉచిత చికిత్స అందించింది బాప్టిస్ట్ ఆస్పత్రి. అందుకోసం సుమారు రూ.16కోట్లు సాయంచేసింది.

Rs. 16 crore free teatment for SMA patient in bangalore
ఎస్​ఎంఏ బాధిత చిన్నారికి 'రూ.16కోట్ల' ఉచిత చికిత్స
author img

By

Published : Feb 17, 2021, 7:44 AM IST

స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్​ఎంఏ) అనే జన్యు సంబంధ సమస్యతో బాధపడుతున్న 14 నెలల చిన్నారికి ఉచిత చికిత్స అందింది. బెంగళూరుకు చెందిన మహ్మద్ బాసిల్, ఖదీజా దంపతుల కుమార్తె ఫాతిమా ఎస్​ఎంఏతో బాధపడుతోంది. జోల్గెన్​స్మా అనే జన్యు చికిత్స ద్వారానే ఈ వ్యాధి నయమవుతుందని వైద్యులు తెలిపారు.

ఈ చికిత్సకు దాదాపు రూ.16 కోట్లు ఖర్చు కానుండగా.. బెంగళూరుకు చెందిన బాప్టిస్ట్ ఆస్పత్రి ఈ చికిత్సను ఉచితంగా చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ఆస్పత్రి, ప్రముఖ ఔషధ సంస్థ నొవార్టిస్ సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా లాటరీ ద్వారా ఈ చిన్నారిని ఎంపిక చేసి చికిత్స చేయించారు.

ఖరీదైన మందులను మంగళవారం ఈ చిన్నారికి అందించినట్లు ఆస్పత్రి సీఈఓ డాక్టర్ నవీన్ థామస్ వెల్లడించారు. రానున్న రోజుల్లో ఈ అరుదైన వ్యాధి పీడుతులకు మెరుగైన చికిత్సలు అందిస్తామని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి: చిన్నారికి అరుదైన వ్యాధి.. సాయం కోసం క్రౌడ్​ ఫండింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.