ETV Bharat / bharat

ఐటీ ఆఫీసర్​లా వచ్చి రూ.40లక్షలు దోపిడీ.. నిమిషాల్లోనే... - దోపిడీ

ఆదాయపు పన్నుశాఖ అధికారి వేషంలో వచ్చి.. ఓ వ్యాపారి నుంచి రూ.40 లక్షలు దోచుకెళ్లాడు ఓ దుండగుడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బులంద్​షెహర్​లో జరిగింది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు.

robbery
దోపిడీ
author img

By

Published : Oct 11, 2021, 6:58 PM IST

Updated : Oct 11, 2021, 10:39 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ బులంద్​​షెహర్​లో ముంబయికి చెందిన ఓ వ్యాపారి దోపిడీకి గురయ్యాడు. ఆదాయపు పన్నుశాఖ అధికారిగా వచ్చిన దుండగులు.. వ్యాపారి నుంచి సుమారు రూ.72 లక్షలు దోచుకెళ్లారు. ఈ ఘటన ఖుర్జా నగర్​ ప్రాంతంలో జరిగింది.
ఇదీ జరిగింది..

కస్​గంజ్​ నగల వ్యాపారి నవనాథ్​ దగ్గర పనిచేస్తున్న ఓంకార్​, శివాజీలు.. దిల్లీలోని ఓ వ్యాపారికి రూ. 72 లక్షలు ఇచ్చేందుకు కారులో బయలుదేరారు. ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఆ వాహనాన్ని మరో కారు ఓవర్​టేక్​ చేసింది. అందులోంచి వచ్చిన ఇద్దరు దుండగులు.. ఐటీ అధికారుల పేరుతో కారులోని వారిని విచారించడం ప్రారంభించారు. ఉద్యోగుల నుంచి డబ్బు తీసుకున్న దుండగులు.. వారిని ముందు వెళ్లమని, ఆ తర్వాత వెనక తాము వస్తామని అన్నారు.

అధికారులని చెప్పుకున్న నిందితులు తమ వాహనం వెనుక కొంత దూరం వచ్చారని.. ఆ తర్వాత ఉన్నట్లుండి పరారు అయ్యారని ఉద్యోగులు వెల్లడించారు.

ఘటన గురించి తెలుసుకున్న వెంటనే క్రైమ్​ బ్రాంచ్​ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. ఖుర్జా నగర్​ పోలీసులు.. వ్యాపారిని విచారించి వివరాలు సేకరించారు.

ఇవీ చూడండి:-

Last Updated : Oct 11, 2021, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.