కర్ణాటక యాదగిరి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు మరణించారు. కారు, లారీ ఢీకొనడం వల్ల చనిపోయిన వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.
రాయ్‌చూర్ జిల్లా లింగసుగుర్ మండలం హట్టి గ్రామానికి చెందిన మహ్మద్ మఝర్ హుసేన్ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ వచ్చారు. కొడంగల్ సమీపంలోని ఓ దర్గాను దర్శించుకుని గురువారం రాత్రి స్వస్థలానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గురమిత్కల్ మండలం అరెకేరా వద్ద వారి కారును.. ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. 6 నెలల చిన్నారితో పాటు మొత్తం ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో బాలుడ్ని పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయిన లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి - car accident today karnataka
కారు, లారీ ఢీకొని ఒకే కుటుంబంలోని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక యాదగిరి జిల్లాలో గురువారం రాత్రి జరిగిందీ ఘటన.