ETV Bharat / bharat

న్యూడ్ కాల్స్​తో బురిడీ.. రూ.లక్షలు లాగేసిన కిలేడి.. సాయం చేస్తానని 'పోలీసు' టోకరా - అసిస్టెంట్ ప్రొఫెసర్​ను బురిడి కొట్టించిన మాయలేడి

దేశంలో రోజురోజుకూ సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. వీటి పట్ల పోలీసులు ఎంత అవగాహన కల్పించినా అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఓ రిటైర్డ్ ప్రొఫెసర్​ను బురిడీ కొట్టించి రూ.21 లక్షలు కాజేసింది ఓ మాయలేడి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

nude video call blackmailing
రిటైర్డ్​ ప్రొఫెసర్​ను బురిడి కొట్టించిన మాయలేడి
author img

By

Published : Oct 13, 2022, 9:04 PM IST

ఓ మాయలేడి వలలో పడి ఓ రిటైర్డ్ ప్రొఫెసర్​ రూ.21 లక్షలు పొగొట్టుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్లీలో వెలుగుచూసింది. ధార్వాడ్​కు చెందిన ఓ రిటైర్డ్ ప్రొఫెసర్​తో అంజలి శర్మ అనే మహిళ పరిచయం ఏర్పరుచుకుంది. అనంతరం వీరిద్దరూ వాట్సాప్​లో కాల్స్ మాట్లాడుకునేవారు. కొన్నిసార్లు న్యూడ్ కాల్స్ చేసుకునేవారు. కొన్నాళ్ల పాటు బాగానే సాగిన వీరి వ్యవహరం ఒక్కసారిగా మలుపు తిరిగింది.

కొన్ని రోజుల తర్వాత అంజలి.. రిటైర్డ్​ ప్రొఫెసర్ ప్రైవేట్​ వీడియోలను, ఫొటోలను స్క్రీన్ షాట్లను తీసి అతడికి మొబైల్​కు పంపింది. తనకు రూ.3 లక్షలు ఇవ్వకపోతే న్యూడ్ ఫొటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్​లోడ్ చేస్తానని బ్లాక్​మెయిల్ చేసింది. దీంతో చేసేదేమీ లేక బాధితుడు.. అంజలి అడిగిన మొత్తాన్ని ఇచ్చేశాడు. ఇంతలో అంజలి సన్నిహితుడు విక్రమ్..​ రిటైర్డ్ ప్రొఫెసర్​కు ఫోన్ చేశాడు. తాను సైబర్ పోలీసు అధికారినని పరిచయం చేసుకున్నాడు.

'మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసిన అంజలి నాకు తెలుసు. రూ.5 లక్షలు ఇస్తే మీ ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు తొలగించడానికి సాయం చేస్తా' అని ప్రొఫెసర్​కు విక్రమ్ చెప్పాడు. అతడి మాటలు నమ్మిన బాధితుడు బ్యాంకు ఖాతా వివరాలు చెప్పాడు. ఈ క్రమంలో బాధితుడి ఖాతా నుంచి విడతలవారీగా రూ.21 లక్షలు కాజేశాడు విక్రమ్​. ఈ క్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్​.. అంజలి, విక్రమ్​పై హుబ్లీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇవీ చదవండి: 14ఏళ్ల యోగా టీచర్.. ఒకేసారి రెండు పీహెచ్​డీలు.. అంతర్జాతీయ స్థాయిలో సత్తా!

రెండేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం.. ప్రేమించడం లేదని రైలు కింద తోసేసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.