ETV Bharat / bharat

RBI Assistant Notification 2023 : డిగ్రీ అర్హతతో.. ఆర్​బీఐలో 450 అసిస్టెంట్​ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా! - ఆర్​బీఐ అసిస్టెంట్ పరీక్ష విధానం

RBI Assistant Notification 2023 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 450 అసిస్టెంట్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్​కు​ సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం.

rbi-assistant-notification-2023-for-450-posts-rbi-notification-and-apply-details
ఆర్బీఐ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2023 వివరాలు
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 11:57 AM IST

RBI Assistant Notification 2023 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 450 అసిస్టెంట్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఆర్​బీఐ తెలిపింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని వెల్లడించింది.

విద్యార్హతలు
RBI Assistant Eligibility : అభ్యర్థులు కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మాత్రం కేవలం డిగ్రీ ఉత్తీర్ణులైతే చాలు. పీసీ వర్డ్ ప్రాసెసింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. దానితోపాటు సంబంధిత రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంత భాషల్లో ప్రావీణ్యం ఉండాల్సి ఉంటుంది.

వయో పరిమితి..
RBI Assistant Age Limit : 2023 సెప్టెంబర్ 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్లు (జనరల్‌) సడలింపు ఉంటుంది.

జీతభత్యాలు..
RBI assistant salary : నెలకు రూ.20,700 నుంచి రూ.55,700.

ఎంపిక విధానం..
ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష ప్రక్రియ..
RBI Assistant Syllabus 2023 : ప్రాథమిక పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.

  1. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్​లో 30 మార్కులకుగానూ 30 ప్రశ్నలు ఇస్తారు.
  2. న్యూమరికల్‌ ఎబిలిటీలో 35 మార్కులకు గానూ.. 35 ప్రశ్నలు ఉంటాయి.
  3. రీజనింగ్‌ ఎబిలిటీలో మరో 35 మార్కులకూ.. 35 ప్రశ్నలు ఉంటాయి.
  4. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు.
  5. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.

ప్రధాన పరీక్ష కూడా ఆబ్జెక్టివ్‌లో విధానంలో ఉంటుంది.

  1. రీజనింగ్‌లో 40 మార్కులకు గానూ 40 ప్రశ్నలు ఉంటాయి.
  2. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్​లోనూ.. 40 మార్కులకు 40 ప్రశ్నలు కేటాయిస్తారు.
  3. న్యూమరికల్‌ ఎబిలిటీలో 40 మార్కులకు 40 ప్రశ్నలు ఇస్తారు.
  4. జనరల్‌ అవేర్‌నెస్‌లో మరో 40 మార్కులకు 40 ప్రశ్నలు ఉంటాయి.
  5. కంప్యూటర్‌ నాలెడ్జ్‌లో 40 ప్రశ్నలు- 40 మార్కులు ఉంటాయి.
  6. మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయిస్తారు.
  7. పరీక్ష వ్యవధి 135 నిమిషాలు.

మెయిన్స్‌ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ) రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షను సంబంధిత రాష్ట్రంలోని అధికారిక భాషలో నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు వివరాలు..
RBI Assistant Apply Online 2023 :

  • జనరల్ అభ్యర్థులకు రూ.450గా ఉంది.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు మాత్రం రూ.50.
  • ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..
RBI Assistant Notification Exam Date :

  • ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 13-09-2023 నుంచి 04-10-2023 వరకు.
  • ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు: 13-09-2023 నుంచి 04-10-2023 వరకు.
  • ఆన్‌లైన్ ప్రిలిమినరీ టెస్ట్ తేదీలు: 21-10-2023, 23-10-2023.
  • ఆన్‌లైన్ మెయిన్‌ ఎగ్జామ్‌ తేదీ: 02-12-2023.
  • వెబ్​సైట్​: rbi.org.in

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.