ETV Bharat / bharat

ఐదేళ్ల చిన్నారిపై పక్కింటి వ్యక్తి 'డిజిటల్ రేప్' - కేరళ లేటెస్ట్ న్యూస్​

పక్కింటి వాడే అని నమ్మిన ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. తనకు ఏం జరిగిందో తెలియక.. పని నుంచి వచ్చిన తల్లికి ఆ చిన్నారి చెప్పిన మాటలు విని నోట మాట రాలేదు. మరోవైపు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

five year girl raped by neighbour in ghaziabad
five year girl raped by neighbour
author img

By

Published : Oct 30, 2022, 6:18 PM IST

ముక్కు పచ్చలారని ఓ ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని పొరుగింటి వ్యక్తి ఆ పాపపై 'డిజిటల్​ రేప్'​కు పాల్పడ్డాడు. తనకేం జరిగిందో అర్థం కాక ఇంటికి వచ్చిన తల్లికి ఆ పాప తన మాటల్లో జరిగిందంతా వివరించింది. దీంతో ఏం చేయాలో తోచని స్థితికి ఆ తల్లి చేరింది. ఇంతటి అమానవీయ ఘటన దిల్లీలోని ఇందిరాపురంలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. ఘాజియాబాద్​ ఇందిరాపుర్​కు చెందిన ఓ మహిళ అదే ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో నర్స్​గా పని చేస్తోంది. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆమె తన కుమార్తెను ఇంట్లో వదిలి డ్యూటీకి వెళ్లింది. ఎవరూ లేరని తెలుసుకున్న ఇంటి పక్కనున్న ఓ వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. ఏం జరుగుతుందో అర్థం కాక ఆ చిన్నారి తల్లి వచ్చేంత వరకు అలానే ఉండిపోయింది.

ఏడుస్తున్న చిన్నారిని దగ్గరకు తీసుకుని తల్లి అడగగా జరిగిందంతా చెప్పింది. దీంతో షాక్​కు గురైన తల్లి పోలీసులను ఇంటికి పిలిచింది. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పాపను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

డిజిటల్​ రేప్​ అంటే ఏమిటి?: డిజిటల్​ అంటే ఇంటర్నెట్​తో ఏమైనా సంబంధం ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే డిజిటల్​, రేప్​ రెండు వేర్వేరు పదాలు. డిజిట్​ అంటే ఆంగ్లంలో అంకె అని అర్థం. ఇంగ్లిష్ డిక్షనరీలో శరీర భాగాలకు కూడా నంబర్లు ఉంటాయి. అందుకే డిజిట్, రేప్ కలిపి డిజిటల్​ రేప్​ అని పేరు పెట్టారు. డిజిటల్​ రేప్​ అంటే.. బాధితురాలి జననాంగంలోకి నిందితుడు చేతి వేళ్లు, కాలి వేళ్లు లేక వస్తువులను చొప్పించడం. విదేశాల్లో మాదిరిగానే డిజిటల్​ రేప్​పై భారత్​లోనూ ఓ చట్టం ఉంది.

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ మాస్టారు..
మంచి బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే.. ఓ విద్యార్థి పాలిట కీచకుడిగా మారాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని దేవరియాలో 15 ఏళ్ల విద్యార్థిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్​ 25న సురోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న బాలికపై 30 ఏళ్ల ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తనపై అత్యాచారానికి పాల్పడుతున్నప్పుడు బాలిక ప్రతిఘటించగా ఆ వ్యక్తి ఆమెను కొట్టి బెదిరించాడు. ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది. ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు పోలీసులతో పాటు విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదును అందుకున్న విద్యాశాఖ అధికారులు.. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

కేరళలో సిక్కింకు చెందిన యువతి ఆత్మహత్య
కేరళ తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్​ హోటల్​లో పని చేస్తున్న 24 ఏళ్ల యువతి శనివారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన యువతిని సిక్కింలోని యాంగ్​టాక్​కు చెందిన వేదాన్షీ కుమారిగా గుర్తించారు.

.
మృతురాలు వేదాన్షీ

అసలేం జరిగింది.. సిక్కింకు చెందిన వేదాన్షీ కేరళలోని కోవలంలో ఓ ప్రైవేట్​ హోటల్​లో ఉద్యోగం చేస్తోంది. ఆమె అదే ప్రాంతంలోని ఓ ఇంట్లో ఇద్దరు సిక్కిం వాసులు, ముగ్గురు కేరళ వాసులతో నివసిస్తోంది. ఈ క్రమంలో శనివారం ఆమె విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది.

అయితే ఆమె అంతకు ముందురోజు రాత్రంతా ఫోన్​లో ఎవరితోనో మాట్లాడుతూ ఉందని, ఉదయం చూసేసరికి రూంలో ఉరి వేసుకుని కనిపించిందని వేదాన్షీ స్నేహితులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:సుపథం టికెట్లను సేవా టికెట్లుగా మార్చి విక్రయం.. వ్యక్తి అరెస్ట్​

అమరావతిలో ఘోర ప్రమాదం.. భవనం కూలి ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.