ETV Bharat / bharat

3నెలల జైలులో ఉండి రెండ్రోజుల క్రితమే ఇంటికి.. భార్యాపిల్లలకు విషమిచ్చి.. తాను ఉరేసుకుని.. - దుండగుల కాల్పుల్లో మృతి చెందిన కానిస్టేబుల్

అత్యాచార ఆరోపణలతో ఓ వ్యక్తి.. మూడు నెలలపాటు జైలులో ఉన్నాడు. రెండు రోజులు క్రితమే జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చాడు. ఇద్దరు పిల్లలు, భార్యకు విషమిచ్చాడు. అనంతరం అతడు ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయారు. ఈ విషాద ఘటన రాజస్థాన్​లో జరిగింది.

Rape accused commits suicide
Rape accused commits suicide
author img

By

Published : Dec 8, 2022, 8:44 PM IST

రాజస్థాన్​కు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అత్యాచార ఆరోపణలతో ఓ వ్యక్తి.. మూడు నెలలపాటు జైలులో ఉండి రెండు రోజులు క్రితమే ఇంటికి వచ్చాడు. ఇద్దరు పిల్లలు, భార్యకు విషమిచ్చాడు. అనంతరం అతడు ఉరేసుకుని చనిపోయాడు.

బాంసవాఢాలోని పిఠాపుర్​ గ్రామానికి చెందిన మోహన్​ దామోర్​ రాజ్​కోట్​లో కూలీగా పనిచేసేవాడు. అక్కడ ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. మూడు నెలల క్రితం అదే మహిళ దామోర్​పై అత్యాచారం చేసినట్లు కేసు పెట్టింది. దీంతో దామోర్​ను మూడు నెలలుపాటు జైలులో ఉంచారు. అయితే రెండు రోజుల క్రితం పోలీసులు దామోర్​ను విడిచిపెట్టారు. ఇంటికి చేరుకున్న దామోర్​ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

దామోర్​ తన భార్య శారద​(36), హరీష్​(14), రాహుల్​(5)కు విషం ఇచ్చాడు. ఆ తర్వాత దామోర్​ ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయాడు. బంధువుల ఇంటికి వెళ్లిన దామోర్​ తండ్రి నాథూ.. ఇంటికి వచ్చి చూడగా అసలు విషయం బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దుండగుల కాల్పుల్లో కానిస్టేబుల్, వ్యాపారి​..
పంజాబ్​లోని​ జలంధర్​లో పట్టపగలే కొందరు దుండగుల కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. కొద్దిరోజులు క్రితం భుపేందర్​ సింగ్​ చావ్లా అనే వస్త్రాల వ్యాపారికి ఓ గ్యాంగ్​స్టర్​ ఫోన్​చేసి.. రూ.20 లక్షల ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. లేదంటే చంపేస్తామని బెదిరించాడు. దీంతో చావ్లా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు.. చావ్లా భద్రతకోసం ఇద్దరు గన్​మెన్​లను నియమించారు.

అయితే బుధవారం చావ్లా దుకాణం నుంచి ఇంటికి వెళ్తుండగా.. నలుగురు వ్యక్తులు బైక్​పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ దాడిలో చావ్లా అక్కడికక్కడే మృతి చెందాడు. గన్​మెన్​గా ఉన్న మన్​దీప్​ సింగ్​ అనే కానిస్టేబుల్​ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర సీఎం వీరమరణం పొందిన కానిస్టేబుల్​ కుటుంబానికి రూ.1 కోటి పరిహారం ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.