ETV Bharat / bharat

శ్రీ కృష్ణుడిని వివాహమాడిన యువతి.. జీవితం కన్నయ్యకు అంకితం - రాజస్థాన్ యువతి వినూత్న వివాహం

రాజస్థాన్​లో ఓ వినూత్న వివాహం జరిగింది. ఓ యువతి కృష్ణభగవానుడ్ని పెళ్లిచేసుకుంది. దీంతో ఈ సంఘటన ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది.

rajasthan girl  Marry lord krishna
కృష్ణభగవానుడ్ని పెళ్లిచేసుకున్న యువతి
author img

By

Published : Dec 15, 2022, 10:58 AM IST

Updated : Dec 15, 2022, 3:24 PM IST

రాజస్థాన్ జైపుర్​కు చెందిన ఓ యువతి చేసుకున్న వినూత్న వివాహం ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది. డిసెంబరు 8వ తేదీన జైపుర్‌, గోవింద్‌గఢ్‌లోని నర్సింగ్‌పురా గ్రామానికి చెందిన పూజా సింగ్(30) శ్రీకృష్ణుడ్ని వివాహమాడింది. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో తన జీవితాన్ని కన్నయ్యకు అంకితం చేసింది.

ఈ వివాహానికి రూ.2.5లక్షలు ఖర్చు అయిందని పూజా సింగ్ తెలిపింది. సుమారు 300 మంది అతిథులు వేడుకకు వచ్చారని వెల్లడించింది. తనకు ఎన్ని మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినా.. వాటన్నింటినీ తిరస్కరించానని చెప్పుకొచ్చింది. "నేను ఓ పూజారి ద్వారా తులసీ వివాహం గురించి తెలుసుకున్నాను. దీంతో శ్రీకృష్ణుడ్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా వివాహానికి గ్రామీణ నేపథ్యం ఉన్న చాలా మంది వ్యతిరేకించారు. అయితే నేను హిందూ మతాచారాల ప్రకారం ఈ వివాహ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాను. కాగా తులసి శాలిగ్రామ వివాహం మాదిరిగానే కన్నయ్యతో నా వివాహం జరిగింది" అని పూజా సింగ్ వివరించింది.

"ఇలాంటి వివాహాలు గతంలో కూడా జరిగాయి. కర్మత్‌గురు పుస్తకంలోని పేజీ నంబర్ 75 ప్రకారం, విష్ణువుతో అమ్మాయి వివాహం చేసుకోవచ్చునని పూజారులు చెప్పారు. ఆడపిల్ల జీవితంలో పెళ్లి అనేది ఒక మధురానుభూతి. రెండేళ్లుగా ఎదురుచూస్తున్న నా వివాహం ఈ రోజు జరిగింది. దేవుడినే నా భర్తగా పొందాను. దేవుడు చిరంజీవి.. నా జీవితం కూడా చిరకాలం ఆనందదాయకంగా ఉంటుందని పూజారి అన్నారు. అయితే ఎప్పటిలాగే ఈ రోజు సాయంత్రం కూడా దైవ దర్శనానికి వెళ్లేటప్పుడు సాధారణ దుస్తులు ధరించి వెళ్లాను."
-పూజా సింగ్

ఇవీ చదవండి:

Last Updated : Dec 15, 2022, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.