ETV Bharat / bharat

8ఏళ్లకే పెళ్లి.. బాడీబిల్డింగ్​తో సెకండ్ ఇన్నింగ్స్.. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్​ మెడల్స్​ - థాయ్​లాండ్​లో బంగారు పతకం సాధించిన మహిళ

8ఏళ్లకే పెళ్లైనా సరే.. ఓ మహిళ తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని బాడీ బిల్డింగ్​ రంగంలో రాణిస్తోంది. రాజస్థాన్​కు చెందిన ఆ మహిళ.. తాజాగా థాయ్​లాండ్​లో జరిగిన 39వ అంతర్జాతీయ మహిళా బాడీ బిల్డింగ్​ పోటీల్లో భారత్​కు బంగారు పతకాన్ని తెచ్చిపెట్టింది. టైటిల్​ గెలుచుకొని భారత్​కు చేరుకున్న ఆమె.. సమాజంలో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Dec 28, 2022, 2:07 PM IST

రాజస్థాన్​కు చెందిన ఓ మహిళా బాడీబిల్డర్​ అరుదైన ఘనత సాధించింది. రాష్ట్రంలోనే బంగారు పతకం సాధించిన మొదటి మహిళా బాడీబిల్డర్​గా గుర్తింపు పొందింది. థాయ్​లాండ్​లో​ జరిగిన 39వ అంతర్జాతీయ మహిళల బాడీబిల్డింగ్​ పోటీల్లో పాల్గొని.. భారత్​కు​ బంగారు పతకం తెచ్చిపెట్టింది. అయితే.. ప్రస్తుతం సమాజం తాను సాధించిన విజయాన్ని కాకుండా.. వేసుకునే దుస్తుల గురించి కామెంట్​ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.

ప్రియా సింగ్​ థాయ్​లాండ్​ పట్టాయాలో జరిగిన ప్రపంచ మహిళల 39వ బాడీబిల్డింగ్​ పోటీల్లో బంగారు పతకం సాధించింది. అనంతరం పోటీలో వేసుకునే దుస్తుల్లోనే ఫోటోలు దిగింది. ఆమె టైటిల్​ గెలిచాక కొందరు ఫోన్​ చేసి అభినందనలు తెలిపారు. అనంతరం తన విజయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ ​మీడియాలో పోస్ట్​లు పెడతామని అన్నారు. అందుకుగాను బికినీలో ఉండే ఫొటోలు కాకుండా సాధారణ డ్రస్​లో ఉండే చిత్రాలు కావాలని కోరారు. వారు అలా కోరడంపై ప్రియా సింగ్​ విచారం వ్యక్తం చేసింది.

Priya Singh of Rajasthan won gold medal
బాడీబిల్డర్​ ప్రియా సింగ్​

"బికినీపై ఎందుకు ప్రశ్నలు? బాడీబిల్డింగ్​ పోటీల్లో పాల్గొనాలి అంటే బికినీ వేసుకోవాలి. ఏ ఆటగాడు అయినా తగిన దుస్తులు ధరించి వేదికపైకి వెళ్తాడు. గెలిచాక కూడా అదే డ్రస్​తో ఫోటోలు దిగితారు. పూర్తిగా వస్త్రాలు ధరిస్తే బాడీబిల్డర్​ శరీరం ఎలా కనిపిస్తుంది? అక్కడ బికినీ అనేది తప్పనిసరి. నేను టైటిల్ గెలిచిన తర్వాత కొందరు ఫోన్​​లు చేసి అభినందనలు తెలిపారు. నా ఫొటోలు సోషల్​ మీడియాలో పెడతామని.. దానికి బికినీలో ఉన్న ఫొటోలు కాకుండా సాధారణ డ్రస్​లో ఉండే చిత్రాలు కావాలని కోరారు. అయితే ఓ మహిళా పోలీసు తన అత్తామామలు, కుటుంబసభ్యులు చూస్తున్నారని యూనిఫాంలో కాకుండా.. తన డ్రస్​ మార్చుకుంటుందా? నా రంగంలో నాకు బికినీ అన్నది యూనిఫాం లాంటిదే. ఆ డ్రస్​తోనే నేను నా కర్తవ్యాన్ని పూర్తి చేస్తాను. ఇలాంటి విషయాల్లో సమాజంలో ఇంకా చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది".
--ప్రియా సింగ్​ మేఘవాల్​, రాజస్థాన్​ మొదటి మహిళా బాడీబిల్డర్​

Priya Singh of Rajasthan won gold medal
వేదికపై తన కండలను చూపిస్తున్న ప్రియా సింగ్​

కుటుంబ నేపథ్యం.. 8 ఏళ్లకే పెళ్లి..
ప్రియా సింగ్ మేఘవాల్​​ జైపుర్​లోని బికనీర్​ ప్రాంతానికి చెందిన మహిళ. ప్రియకు 8ఏళ్ల వయస్సులోనే కుటుంబసభ్యులు వివాహం చేశారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రియా సింగ్​ పనిచేయాలని నిర్ణయించుకుంది. కానీ చిన్నతనంలోనే పెళ్లి కారణంగా.. ఐదో తరగతిలోనే చదవు ఆగిపోయింది. అదే సమయంలో ఒకరు స్థానికంగా ఉండే జిమ్​లో ఉద్యోగం చేయమని సూచించారు. ప్రియా ఎత్తు​ను చూసి జిమ్​ యాజమాన్యం ఆమెకు అవకాశం కల్పించారు. అప్పటి నుంచి శిక్షణ పొంది జిమ్​లో కష్టపడి పనిచేయడం నేర్చుకుంది.

Priya Singh of Rajasthan won gold medal
జిమ్​లో ప్రియా సింగ్​

జిమ్​లో ప్రియ ప్రయాణం ..
ఇంతలో బాడీబిల్డింగ్​ రంగాల్లో మహిళలు లేరనే వార్త ప్రియకు తెలిసింది. దీంతో తాను ఓ మహిళా బాడీబిల్డర్​ కావాలని నిశ్చయించుకుని.. పోటీలకు సిద్ధమైంది. అదే సమయంలో తాను ధరించే దుస్తుల విషయంలో బంధువులు, స్థానికులు నుంచి ప్రశ్నలు తలెత్తేవి. ఆ సమయంలో భర్త, కుటుంబసభ్యులు ప్రియకు అండగా నిలిచారు. వేసుకునే దుస్తుల కారణంగా ఆమె బంధువులు కొందరు ఫోన్లు కూడా​ చేయడం మానేశారు.

Priya Singh of Rajasthan won gold medal
ప్రియా సింగ్​

2018లో మొదటిసారిగా బాడీబిల్డింగ్​ వేదికపైకి వెళ్లి.. రాజస్థాన్​లోనే మొదటి మహిళా బాడీబిల్డర్​గా నిలిచింది ప్రియా సింగ్. ఆ తర్వాత 2018, 2019, 2020ల్లో వరుసగా మిస్​ రాజస్థాన్​ టైటిల్​ను గెలుచుకుంది. దానితో పాటుగా ఓ అంతర్జాతీయ టైటిల్​ను కూడా దక్కించుకుంది. ప్రస్తుతం తాను సీరియల్​ నటిగా, మోడల్​గానూ రాణిస్తున్నట్లు తెలిపింది.

Priya Singh of Rajasthan won gold medal
సీరియల్​ నటిగా రాణిస్తున్న ప్రియా సింగ్​

దేశం పేరు ప్రకాశించేలా.. జీవితంలో ఇంకా ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు ప్రియ చెప్పింది. ఈ విజయం సాధించిన తర్వాత.. జైపుర్​ విమానాశ్రయానికి రాగానే ఘనంగా స్వాగతం పలుకుతారని అనుకున్నా.. కుటుంబసభ్యులు, మిత్రులు మాత్రమే వచ్చారని కాస్త విచారం వ్యక్తం చేసింది.

ప్రియా సింగ్​, రాజస్థాన్​ మహిళా బాడీ బిల్డర్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.