ETV Bharat / bharat

'మీ తప్పు వల్ల 700 మంది చనిపోతే.. సమాచారం లేదంటారా?' - సాగు చట్టాల రద్దు

Rahul Gandhi on farmers protest: రైతుల మరణాలపై వివరాలు లేవని పార్లమెంట్​లో కేంద్రం ప్రకటించటంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. కేంద్రం చేసిన తప్పువల్ల 700 మంది చనిపోయారని, ఇప్పుడు వారి వివరాలపై అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

Rahul gandhi
రాహుల్​ గాంధీ
author img

By

Published : Dec 3, 2021, 5:24 PM IST

Rahul Gandhi on farmers protest: నూతన సాగు చట్టాల వ్యతిరేక ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల వివరాలు తమ వద్ద లేవని, పరిహారం ఇవ్వలేమని పార్లమెంట్​లో కేంద్రం ప్రకటించటాన్ని తప్పుపట్టారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. స్వయంగా ప్రధానమంత్రి తప్పు చేసినట్లు ఒప్పుకుని, దేశానికి క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. ఆ తప్పు వల్ల 700 మంది చనిపోయారని, ఇప్పుడు వారి వివరాలపై అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

"రైతుల ఆందోళనల సమయంలో మరణించిన అన్నదాతల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించటంపై పార్లమెంట్​లో ప్రశ్నించారు. దానికి వ్యవసాయ శాఖ వద్ద రైతుల మరణాలపై ఎలాంటి సమాచారం లేదని, అందువల్ల పరిహారం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదని కేంద్రం సమాధానమిచ్చింది. పంజాబ్​ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం అందించిన వారు 403 మంది ఉన్నారు. 152 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి 100 మంది జాబితా ఉంది. ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు 200 మంది పేర్లతో తయారు చేసిన మూడో జాబితా ఉంది. కానీ, ప్రభుత్వం అలాంటి జాబితానే లేదని చెబుతోంది."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

రైతుల మరణాలతో పంజాబ్​ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేనప్పటికీ రూ.5 లక్షల పరిహారం, ఉద్యోగాలు కల్పించిందని తెలిపారు రాహుల్​ గాంధీ. ప్రాణాలు కోల్పోయిన రైతుల జాబితాను సోమవారం పార్లమెంట్​కు సమర్పిస్తానని చెప్పారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరిస్తుందని తాను భావించటం లేదని, వారి ఆలోచనలు సరిగా లేవని ఆరోపించారు రాహుల్​.

వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటన..

రైతు మరణాలు, నిరసనల వల్ల ప్రభావితమైన రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం, కేసుల ఉపసంహరణపై పార్లమెంట్​లో విపక్షాలు ప్రశ్నించగా..కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఆ అంశాలపై ప్రభుత్వం వద్ద తగిన సమాచారం లేదన్నారు. అలాంటప్పుడు సాయం అనే దానికి తావే లేదని తోమర్​ స్పష్టం చేశారు.

Farmers death: 'రైతుల మరణాలపై సమాచారం లేదు- సాయం చేయలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.