Rahul Gandhi on Modi interview: ఈడీ, సీబీఐ ద్వారా తనపై ఒత్తిడి తీసుకురావడం అసాధ్యమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన.. మోదీపై విమర్శలు గుప్పించారు. ప్రధాని తన పూర్తి సమయాన్ని కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేసేందుకే ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు.
"'రాహుల్ చెప్పింది వినరు' అని మోదీ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దానర్థం తెలుసా? ఈడీ, సీబీఐ ద్వారా రాహుల్‌పై ఒత్తిడి తీసుకురావడం కుదరదని అర్థం. రాహుల్ వెనక్కి తగ్గడు అని అర్థం. అయినా నేనెందుకు వారి మాట వినాలి?"
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
Rahul Gandhi Uttarakhand rally:
చైనా గురించి మాట్లాడే ధైర్యం మోదీకి లేదని రాహుల్ ధ్వజమెత్తారు. ఆ దేశ సైనికులు దేశంలోకి చొరబడ్డారని అన్నారు. నోట్ల రద్దు, తప్పుడు జీఎస్టీ వల్ల చిన్న వ్యాపారులను దెబ్బతీశారని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఇదీ చదవండి: 'అల్లర్లు వద్దనుకుంటే భాజపా అధికారంలోనే ఉండాలి'