ETV Bharat / bharat

'చైనా ఆక్రమణలో భారత భూభాగం'.. రాహుల్ వ్యాఖ్యలపై దుమారం.. కేంద్ర మంత్రి కౌంటర్ - రాహుల్​ గాంధీ లేటెస్ట్ కామెంట్స్​ చైనా

Rahul Gandhi On China Issue : భారత భూభాగాన్ని చైనా సైన్యం ఆక్రమించుకుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈ విషయంపై ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. లద్దాఖ్​ పర్యటనలో ఉన్న ఆయన.. స్థానిక ప్రజలు చైనా ఆక్రమణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అయితే, కేంద్ర మంత్రి సింధియా రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

RAHUL GANDHI ON CHINA INDIA
RAHUL GANDHI ON CHINA INDIA
author img

By

Published : Aug 20, 2023, 1:08 PM IST

Rahul Gandhi On China Issue : తూర్పు లద్దాఖ్​లో చైనా బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించాయంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. లద్దాఖ్​ పర్యటనలో ఉన్న రాహుల్.. అక్కడి ప్రజలు ఈ విషయంపై ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం.. చైనాకు క్లీన్​చిట్ ఇచ్చారని విమర్శించారు. లద్దాఖ్​లో ఎవరిని అడిగినా.. మోదీ చెప్పిన విషయం అబద్ధమని తెలుస్తుందని అన్నారు.

  • VIDEO | Congress leader Rahul Gandhi interacted with locals of Man Pangong village in Ladakh earlier today. pic.twitter.com/L5JmeE9Ed9

    — Press Trust of India (@PTI_News) August 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
RAHUL GANDHI ON CHINA INDIA
రాజీవ్​ గాంధీకి నివాళులర్పిస్తున్న రాహుల్​

రాజీవ్​ గాంధీ జయంతి నేపథ్యంలో..
Rahul Tribute To Rajiv Gandhi : తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి నేపథ్యంలో రాహుల్.. లద్దాఖ్​లో పర్యటించారు. మోటార్ సైకిల్​పై పాంగాంగ్ సరస్సు వద్దకు వెళ్లారు. అక్కడ రాజీవ్ గాంధీకి రాహుల్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చైనా ఆక్రమణపై కీలక వ్యాఖ్యలు చేశారు.

  • #WATCH | " Here, the concern is of course China has taken away the land...people have said that China's army has entered the area and their grazing land was taken away but PM said that not an inch of land was taken away, but this is not true, you can ask anyone here...": Rahul… pic.twitter.com/quIGZHpHqP

    — ANI (@ANI) August 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #WATCH | "There were so many complaints from the people of Ladakh, they are not happy with the status that has been given to them, they want representation and there is a problem of unemployment...people are saying that the state should not be run by bureaucracy but state must be… pic.twitter.com/bymmXRci1H

"లద్దాఖ్​ ప్రజలు అనేక అంశాలపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడు వారికి ఇచ్చిన హోదా (కేంద్ర పాలిత ప్రాంతం)తో సంతృప్తిగా లేరు. తమకు ప్రాతినిధ్యం కావాలని కోరుకుంటున్నారు. నిరుద్యోగం సమస్య కూడా ఉంది. తమ రాష్ట్రాన్ని బ్యూరోక్రాట్లు కాకుండా.. ప్రజాప్రతినిధులు పాలించాలని కోరుకుంటున్నారు. చైనా.. తమ భూభాగాన్ని తీసేసుకుందన్న ఆందోళన కూడా ఇక్కడ ఉంది. తమ ప్రాంతంలోకి చైనా సైన్యం చొరబడిందని ప్రజలు చెబుతున్నారు. పశువులను మేతకు తీసుకెళ్లే ప్రాంతాలను వారు లాగేసుకున్నారని చెప్పారు. కానీ, ప్రధాని మాత్రం.. ఒక్క అంగుళం కూడా ఎవరూ తీసుకోలేదని చెబుతున్నారు. అది నిజం కాదు. ఇక్కడ మీరు ఎవరినైనా అడగండి."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ

'చైనాకు కాంగ్రెస్​ ప్రభుత్వమే 45వేల చదరపు కిలోమీటర్ల భూమిని..'
రాహుల్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వమే 45వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనాకు ఇచ్చిందని విమర్శించారు. 'హిందీ చీనీ (చైనా) భాయీ భాయీ' అని నినదించే కాంగ్రెస్ పార్టీ.. ముందుగా ఈ విషయంపై మాట్లాడాలని చురకలు అంటించారు.

  • #WATCH | Union Minister and BJP MP Jyotiraditya Scindia says, "Congress who chanted the slogans of 'hindi chini bhai bhai' & gave away 45,000 sq km to China should first look within..." pic.twitter.com/B4oO3sxr8f

'అలాంటి వ్యాఖ్యలు సరికాదు..'
అయితే, భూభాగాన్ని లాగేసుకున్నారంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని రక్షణ రంగ నిపుణుడు సంజయ్ కులకర్ణి అభిప్రాయం వ్యక్తం చేశారు. సరిహద్దు సమస్యపై చర్చలు జరుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన.. ఈ సమయంలో అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు. 'సరిహద్దులోని దెమ్​చోక్, దెస్పాంగ్​ ప్రాంతాల వద్ద ఘర్షణాత్మక వాతావరణం ఉంది. అక్కడ పెట్రోలింగ్​ నిర్వహించలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా ఈ విషయంపైనే చర్చలు జరుగుతున్నాయి. భూభాగాన్ని కోల్పోయాం అనడం సరికాదు. ఎవరూ కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. 1950 నుంచి మనం చైనాకు 40 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయం. మరింత భూభాగాన్ని చైనాకు కోల్పోకూడదనేదే మా ప్రయత్నం' అని కులకర్ణి వివరించారు.

Rahul Gandhi Bike Ride : స్టైలిష్ లుక్​లో రాహుల్ గాంధీ.. స్పోర్ట్స్​ బైక్​పై లద్ధాఖ్ టూర్​

రక్షణశాఖ స్టాండింగ్​ కమిటీలోకి రాహుల్​.. సభ్యత్వం పునరుద్ధరణ జరిగిన 10 రోజుల్లోనే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.