ETV Bharat / bharat

'భాజపా వల్ల దేశంలో చీలిక.. త్వరలో ఉక్రెయిన్ తరహా పరిస్థితులు!' - రాష్ట్రీయ జనతా దళ్​

Rahul Gandhi on BJP: కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. భాజపా కారణంగా దేశం చీలిపోయిందన్నారు. సరిహద్దుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని.. ఇదే కొనసాగితే ఉక్రెయిన్​లో నెలకొన్న పరిస్థితులు రావొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

rahul gandhi comments
'భాజపా వల్ల దేశం చీలిపోయింది.. త్వరలో శ్రీలంకలోని పరిస్థితులే ఇక్కడ కూడా'
author img

By

Published : Apr 8, 2022, 2:59 PM IST

Rahul gandhi comments: దేశం ఇదివరకు ఐక్యంగా ఉండేదని కానీ ఇప్పుడు అంతర్గతంగా వివిధ దేశాలుగా విడిపోయిందన్నారు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ. భారత్​లో వేర్వేరు వర్గాలుగా ఈ విభజన.. హింసకు దారి తీస్తోందని చెప్పుకొచ్చారు. గత 2-3 ఏళ్లగా భారత్​లో నెలకొన్న పరిస్థితులపై వాస్తవాలను మీడియా సహా భాజపా, ఆర్​ఎస్​ నేతలు కప్పిపుచ్చుతున్నారని, త్వరలోనే ఆ నిజం బయటపడుతుందని వ్యాఖ్యానించారు. శ్రీలంక, ఉక్రెయిన్​లో నెలకొన్న పరిస్థితులు త్వరలో భారత్​లో కూడా వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్​జేడీ నేత శరద్​ యాదవ్​తో దిల్లీలో భేటీ సందర్భంగా రాహుల్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

"డొనెస్క్​, లుహాన్స్​క్​ ప్రాంతాలు ఉక్రెయిన్​కు చెందవని రష్యా వాదిస్తోంది. ఈ కారణంతోనే రష్యా దాడి చేస్తోంది. చైనా కూడా అదే పద్ధతిని అనుసరిస్తోంది. లద్దాఖ్​, అరుణాచల్​ ప్రదేశ్ భారత్​లో అంతర్భాగం కావని వాదిస్తోంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో బలగాలను మోహరించింది. కానీ ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రభుత్వం వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది."
-రాహుల్​ గాంధీ

దేశంలో ఆర్థిక స్థితి దుర్భరంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. ఉపాధి వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని.. దీంతో దేశానికి వెన్నెముక విరిగినట్లు అయిందన్నారు. చిన్న-మధ్య తరగతి వ్యాపారులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.

  • కాంగ్రెస్​ అధ్యక్షుడు కావాలి: రాహుల్​ గాంధీకి కాంగ్రెస్​ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించాలన్నారు శరద్​ యాదవ్. అలా అయితేనే పార్టీ పుంజుకుంటుదని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్​ తన పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్నారని కితాబిచ్చారు.

ఇదీ చదవండి: ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ 'మాస్టర్'​ ప్లాన్​.. రంగంలోకి పీకే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.