ETV Bharat / bharat

Rahul Gandhi Bike Ride : స్టైలిష్ లుక్​లో రాహుల్ గాంధీ.. స్పోర్ట్స్​ బైక్​పై లద్ధాఖ్ టూర్​ - Rahul Gandhi bike ride photos latest

Rahul Gandhi Bike Ride : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ న్యూలుక్​లో కనిపించారు. లద్ధాఖ్ పర్యటనలో ఉన్న ఆయన స్పోర్ట్స్​ బైక్​ను రైడ్ చేస్తూ పాంగాంగ్ సరస్సుకు వెళ్లారు.

Rahul Gandhi Bike Ride
Rahul Gandhi Bike Ride
author img

By

Published : Aug 19, 2023, 1:29 PM IST

Updated : Aug 19, 2023, 2:09 PM IST

Rahul Gandhi Bike Ride : కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్​లోని లేహ్​లో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా భారత్​ - చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్​ సరస్సుకు ఆయన సోర్ట్స్​ బైక్​పై వెళ్లారు. 'ప్రపంచంలో అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్ సరస్సు ఒకటని నా తండ్రి రాజీవ్ గాంధీ చెప్పేవారు' అని రాహుల్ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ పెట్టారు.

'సూపర్​ సర్​​.. రేసర్​లా ఉన్నారుగా'
Rahul Gandhi Ladakh Trip : రాహుల్ గాంధీ బైక్ రైడ్​కు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్​ పార్టీ కూడా తమ ఎక్స్ ​(ట్విట్టర్​) ఖాతాలో పోస్ట్ చేసింది. 'Upwards And Onwards - Unstoppable!' అంటూ ట్వీట్​ చేసింది. రాహుల్ కొత్త లుక్​పై ఆ పార్టీ కార్యకర్తలు, నెటిజన్లు.. సూపర్ సర్​ అంటూ కామెంట్లు పెడుతున్నారు. రాహుల్ రేసర్​లా ఉన్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Rahul Gandhi Bike Ride
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

టూరిస్ట్​ క్యాంప్​లో రాహుల్​ బస..
Rahul Ladakh Ride : శనివారం రాత్రి.. పాంగాంగ్‌ సరస్సు వద్ద ఉన్న టూరిస్ట్‌ క్యాంప్‌లో రాహుల్​ బస చేయనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 20వ తేదీన తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ జయంతిని రాహుల్‌ ఈ సరస్సు వద్దే చేసుకోనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Rahul Gandhi Bike Ride
సోర్ట్స్​ బైక్​తో రాహుల్

రెండు రోజులే ఉండాలని వచ్చినా..
Rahul Gandhi Sports Bike : గత గురువారం రాహుల్‌.. లేహ్‌ పర్యటనకు వచ్చారు. తొలుత రెండు రోజుల పాటే ఇక్కడ ఉండాలని భావించినా.. ఆగస్టు 25 వరకు తన పర్యటనను పొడిగించుకున్నారు. 2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత లద్ధాఖ్‌లో రాహుల్​ పర్యటించడం ఇదే తొలిసారి. శుక్రవారం ఆయన లేహ్‌లోని యువతతో కాసేపు సరదాగా ముచ్చటించారు.

Rahul Gandhi Bike Ride
లద్ధాఖ్ ట్రిప్​లో రాహుల్​

కాంగ్రెస్​ నేతలతో రాహుల్​ సమవేశాలు
Rahul Gandhi Ladakh Visit : మరోవైపు, సెప్టెంబరు 10న లద్ధాఖ్​ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (LAHDC) - కార్గిల్‌ ప్రాంతంలో కౌన్సిల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌.. స్థానిక నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఈ క్రమంలో రాహుల్‌.. లేహ్‌ పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటనలో భాగంగా ఆయన స్థానిక కాంగ్రెస్‌ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Rahul Gandhi Bike Ride
బైక్​ నడుపుతున్న రాహుల్ గాంధీ
Rahul Gandhi Bike Ride
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

మెకానిక్​ అవతారమెత్తిన రాహుల్​.. కష్టజీవులతో ముచ్చట్లు

మళ్లీ లారీ ఎక్కిన రాహుల్​ గాంధీ.. ఈసారి అమెరికాలో 190కి.మీ జర్నీ

'రాహుల్​కు పెళ్లి చేద్దాం.. మంచి అమ్మాయిని చూడండి'.. మహిళా రైతులతో సోనియా గాంధీ

Last Updated : Aug 19, 2023, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.