ETV Bharat / bharat

'చైనాను చూసి మోదీ భయపడుతున్నారు' - చైనా లద్దాఖ్​

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చైనాను చూసి భయపడుతున్నట్లు కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ ఆరోపించారు. భారత్​-చైనా సరిహద్దు వివాదంపై మాట్లాడిన రాహుల్​.. ప్రధాని అసమర్థత కారణంగానే భారత్​ భూభాగంలోకి డ్రాగన్ వచ్చిందని మండిపడ్డారు.

Rahul attacks Modi over Sino-India standoff; says Chinese know PM is 'scared'
'చైనాను చూసి మోదీ భయపడుతున్నారు'
author img

By

Published : Feb 27, 2021, 6:04 PM IST

భారత్​-చైనా సరిహద్దు వివాదంపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీపై ముప్పేట దాడికి దిగారు. పొరుగు దేశం చైనా చేస్తున్న అరాచకాలను చూసి భయపడుతున్నారని ఆరోపించారు. అందుకే డ్రాగన్​ బలగాలు సరిహద్దులు దాటి మన దేశంలోకి వచ్చాయని విమర్శించారు. లద్దాఖ్​ ప్రతిష్టంభనకు ముందు.. 2017లో డోక్లాంలో కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. చూస్తూ ఊరుకుంటే చైనా ఇంకా తెగించే అవకాశాలున్నాయని హెచ్చరించారు.

"భారత్​లోని కొన్ని వ్యూహాత్మక ప్రాంతాలపై దృష్టి పెట్టిన చైనా.. వాటిని ఆక్రమించింది. తొలుత డోక్లాంలో అనుకున్న విధంగా తన వ్యూహాన్ని అమలు చేసింది. భారత్​ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం చూసి లద్దాఖ్​లో, ఆ తరువాత అరుణాచల్​ ప్రదేశ్​లోకి చొచ్చుకువచ్చింది. ప్రధాని భయం కారణంగా మనం కోల్పోయిన భూభాగం కొంత కూడా తిరిగి రాదు. అది మోదీకి కూడా తెలుసు. కానీ నటిస్తున్నారు. "

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో.. రాహుల్ అక్కడ​ మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు. ప్రచారంలో భాగంగా అక్కడి న్యాయవాదులతో మాట్లాడారు. కేంద్రం పాలన అంతా 'హం దో.. హమారే దో'(మనం ఇద్దరం.. మనకు ఇద్దరు.) అన్న తీరుగా ఉందని దుయ్యబట్టారు. చైనా చొరబాట్లపై మాట్లాడిన ఆయన.. మొదట ప్రధాని 'దేశంలోకి ఎవరూ రాలేరు' అన్నారు. ఈ ప్రకటనే ప్రధాని భయపడినట్లు చైనాకు సంకేతాలు వెళ్లాయని తెలిపారు.

ఇదీ చూడండి: చర్చలు భేష్​: భారత్​-చైనా సంయుక్త ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.