ETV Bharat / bharat

పుతిన్​కు మోదీ ఫోన్​.. ద్వైపాక్షిక అంశాలపై చర్చ - పుతిన్ మోదీ ఫోన్​ సంభాషణ

Putin Modi Phone Call: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్​లో సంభాషించారు. ఇరు దేశాల మధ్య పలు అభివృద్ధి అంశాలు, అంతర్జాతీయ సమస్యలు, ఇండో- పసిఫిక్ పరిస్థితులపై చర్చించారు.

Putin Modi Phone Call
పుతిన్ మోదీ
author img

By

Published : Dec 20, 2021, 10:38 PM IST

Putin Modi Phone Call: ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సోమవారం ఫోన్లో సంభాషణలు జరిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సమస్యలు, ఇండో- పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితిపై చర్చించారు. పుతిన్ భారత్​ పర్యటన పూర్తయి రెండు వారాలు దాటిన తర్వాత ఇరు దేశాధినేతలు ఫోన్​లో సంభాషించుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

" నా స్నేహితుడు పుతిన్​తో మాట్లాడాను. ఇటీవల పుతిన్​ను కలిసినప్పుడు తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చించాం. భారత్​- రష్యా భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా నిర్ణయం తీసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల అభివృద్ధి చెందిన అంశాలపైనా చర్చించాం."

-- ప్రధాని నరేంద్ర మోదీ

ఇదే సంభాషణపై పుతిన్​ కూడా మోదీకి కృతజ్ఞతలు తెలిపినట్లు రష్యా ప్రభుత్వవర్గాలు తెలిపాయి. డిసెంబరు 6న రష్యాకు చెందిన ప్రతినిధులు భారత్​లో పర్యటించినప్పుడు కేంద్రం ఇచ్చిన ఆతిథ్యంపై పుతిన్ కృతజ్ఞతలు తెలిపినట్లు వివరించాయి.

సెంట్రల్​ ఆసియా దేశాలతో మోదీ భేటీ..

Central Asia Ministers Modi: సెంట్రల్ ఆసియా దేశాల విదేశాంగ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సెంట్రల్ ఆసియా దేశాలైన కజకిస్థాన్​, కిర్గిస్థాన్​, తజకిస్థాన్​, తుర్కె​మినిస్థాన్​, ఉజ్బెకిస్థాన్​ దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఆయా దేశాలతో భారత్​కు ఉన్న ప్రాముఖ్యతను ప్రస్తావించారు. అఫ్గానిస్థాన్​లో పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రధాని మోదీతోపాటు విదేశాంగమంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్​ పాల్గొన్నారు.

Central Asia Ministers Modi
సెంట్రల్​ ఆసియా విదేశాంగ మంత్రులతో మోదీ

ఐదు సెంట్రల్​ ఆసియా దేశాలతో భారత్​కు ఉన్న సాంస్కృతిక, వ్యాపార ఒప్పందాలను బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపారు. ఈ సమావేశం తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Central Asia Ministers Modi
సెంట్రల్​ ఆసియా విదేశాంగ మంత్రులతో మోదీ సమావేశం

" సెంట్రల్ ఆసియాలోని ఐదు దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యాను. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపాం." అని మోదీ ట్వీట్​లో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: జపాన్ కుబేరుడి స్పేస్ టూర్ సక్సెస్.. సేఫ్​గా భూమికి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.