ETV Bharat / bharat

తల్వార్లతో పోలీస్ స్టేషన్ వద్ద రచ్చ.. అనుచరుడిని విడిపించుకున్న 'ఖలిస్థానీ'లు - అమృత్ పాల్ సింగ్ వారీస్ పంజాబ్ డే

తమ అనుచరుడి విడుదల కోసం హింసాత్మక ఆందోళనకు దిగారు ఖలిస్థానీ మద్దతుదారులు. 'వారీస్​ పంజాబ్​ దే' అధినేత అమృత్​పాల్​ పిలుపు మేరకు వేలాది మంది తుపాకులు, తల్వార్లతో అజ్నాలా పోలీస్​ స్టేషన్​పైకి దండెత్తారు. అమృత్​పాల్ సింగ్​ సన్నిహితుడు లవ్​ప్రీత్​ తుఫాన్​ అరెస్టుకు నిరసనగా ఆందోళన చేశారు. చివరకు లవ్​ప్రీత్​ను పోలీసులు విడుదల చేయడం గమనార్హం.

punjab protest
అమృత్​సర్​లో తీవ్ర ఉద్రిక్తత
author img

By

Published : Feb 23, 2023, 2:40 PM IST

Updated : Feb 23, 2023, 7:29 PM IST

తుపాకులు, తల్వార్లతో పోలీస్ స్టేషన్​ ముట్టడి

పంజాబ్ అమృత్​సర్​లో హింస చెలరేగింది. ఖలిస్థానీ అనుకూల సంస్థ 'వారీస్​ పంజాబ్​ దే' మద్దతుదారులు అజ్నాలా పోలీస్ స్టేషన్ వద్ద విధ్వంసానికి దిగి.. తమ అనుచరుడిని విడుదల చేయించుకున్నారు. 'వారీస్ పంజాబ్ దే' అధినేత అమృత్​పాల్​ పిలుపుతో.. వేలాది మంది మద్దతుదార్లు తుపాకులు, తల్వార్లతో అజ్నాలా పోలీస్​ స్టేషన్​ను ముట్టడించారు. అమృత్​పాల్ సింగ్​ సన్నిహితుడు లవ్​ప్రీత్​ తుఫాన్​ అరెస్టుకు నిరసనగా వారంతా ఇలా ఆందోళన చేశారు. చివరకు వీరి ఆందోళనలకు పోలీసులు తలొగ్గి లవ్​ప్రీత్ తుఫాన్​ను విడుదల చేశారు. అయితే, 'పంజాబ్ పోలీసులకు సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే లవ్​ప్రీత్​ను విడుదల చేశాం' అని అమృత్​సర్ ఎస్ఎస్పీ వెల్లడించారు. ఈ వ్యవహారంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్​ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

అంతకుముందు అజ్నాలా పోలీస్ స్టేషన్ వద్ధ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. లవ్​ప్రీత్​ కోసం అజ్నాలా పోలీస్ స్టేషన్​ను చుట్టుముట్టాలని ఇటీవల బహిరంగంగా పిలుపునిచ్చారు అమృత్​పాల్. ఈ నేపథ్యంలోనే ఆయుధాలు చేతబట్టి పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్​కు వచ్చారు ఆయన మద్దతుదారులు. తల్వార్లతో పోలీసులపై దాడి చేస్తూ స్టేషన్​లోకి చొచ్చుకెళ్లారు. నిరసనకారుల్ని కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆందోళకారుల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో సాయంత్రం లవ్​ప్రీత్​ను విడుదల చేశారు పోలీసులు.

వివాదం ఏంటంటే?
లవ్​ప్రీత్​ తుఫాన్​ను పోలీసులు అరెస్టు చేసి చిత్ర హింసలు పెడుతున్నారని అమృత్​పాల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమృత్ పాల్ సింగ్ తన అనుచరులతో కలిసి జల్​పుర్ ఖైరా ప్రాంతం నుంచి అజనాలేకు భారీ ర్యాలీగా బయల్దేరారు. అక్రమంగా అరెస్టు చేసిన లవ్​ప్రీత్​ను విడుదల చేయకపోతే తమ సొంత ప్లాన్​ను అమలు చేస్తామని పోలీసులను హెచ్చరించారు.

'150 మందితో నేను అక్కడికి వెళ్తున్నా. తుఫాన్ సింగ్​ను చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసి ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు. తుఫాన్​ను హింసిస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన తుఫాన్ సింగ్​ను విడుదల చేయకపోతే మా సంస్థ తన ప్లాన్ అమలు చేస్తుంది. మాపై అక్రమ కేసులు పెట్టడం ఆపకపోతే దీనికి మా సంస్థే పరిష్కారం కనుగొంటుంది.'
-అమృత్​పాల్

వివాదాల అమృత్!
'వారీస్ పంజాబ్ దే'ను ఖలిస్థాన్ అనుకూల సంస్థగా పేర్కొంటారు. మత బోధకుడిగా చెప్పుకునే ఆ సంస్థ అధినేత అమృత్​పాల్ సింగ్ చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. కిడ్నాప్, దొంగతనం, హింసకు పాల్పడటం వంటి కేసులు ఆయనపై నమోదయ్యాయి.

Last Updated : Feb 23, 2023, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.