ETV Bharat / bharat

హైవేకు అడ్డంగా రైతు డ్రీమ్​ హౌస్​, కూల్చలేక 500 అడుగులు వెనక్కి - ఇంటిన వెనక్కి జరిపిన పంజాబ్​ రైతు

జాతీయ రహదారి కోసం తన ఇంటిని కూల్చేయడం అతడికి ఇష్టం లేదు. అందుకోసం ఏకంగా ఇంటినే 500 అడుగులు వెనక్కి జరిపి తన కలల సౌధంపై ఎంత ప్రేముందో చాటుకున్నాడు పంజాబ్​కు చెందిన ఓ రైతు.

Farmer Move  House 500 Feet Away
Punjab farmer to move his 2-storey house 500 feet away for expressway construction
author img

By

Published : Aug 21, 2022, 8:36 AM IST

Updated : Aug 21, 2022, 9:02 AM IST

Farmer Moved House 500 Feet Away: ''ఆ ఇల్లు నా కలలకు ప్రతిరూపం. రూ.కోటిన్నర ఖర్చు పెట్టా. ఇపుడు మరో ఇల్లు కట్టుకోవడం నాకు ఇష్టం లేదు'' అంటున్నారు పంజాబ్‌కు చెందిన సుఖ్విందర్‌ సింగ్‌. ఈ రైతు ఇంటికి వచ్చిన కష్టం ఏమిటంటే.. దిల్లీ - అమృత్‌సర్‌ - కట్రా ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి అడ్డుగా ఉన్నందున, పొలంలో కట్టుకొన్న ఇంటిని తొలగించాల్సి వస్తోంది. సుఖ్విందర్‌ సింగ్‌ కట్టుకొన్న ఈ రెండంతస్తుల ఇల్లు సంగ్రూర్‌ పట్టణ సమీపంలోని రోషన్‌వాలా గ్రామంలో ఉంది. కేంద్రం చేపట్టిన భారత్‌మాల ప్రాజెక్టులో భాగంగా ఈ మార్గంలో ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం జరుగుతోంది.

'ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే దిల్లీ నుంచి పంజాబ్‌ మీదుగా జమ్ముకశ్మీర్‌కు వెళ్లే ప్రయాణికులకు వ్యయ ప్రయాసలతోపాటు సమయమూ ఆదా అవుతుంది' అని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి, ఆ ఇంటిని తొలగించాలని రైతుకు పరిహారం కూడా ఇచ్చారు. ఇంటిని పడగొట్టడం ఇష్టం లేని సుఖ్విందర్‌ దాన్ని ఓ 500 అడుగులు మేర వెనక్కు జరిపే బృహత్తర కార్యక్రమాన్ని తలకు ఎత్తుకున్నారు. కార్మికులను పురమాయించి ఇప్పటికే 250 అడుగులు వెనక్కు జరిపారు కూడా. ఇంటి కింద చక్రాల్లాంటివి అమర్చి క్రమక్రమంగా వెనక్కు జరుపుతూ పనులు కొనసాగిస్తున్నారు.

ఇవీ చదవండి: చెత్త కుప్పలో అస్థిపంజరాలు, ఎముకలపై ఇంగ్లిష్​లో పేర్లు, ఏంటి కథ

విద్యార్థినిపై అరాచకాలు, ట్యూషన్ టీచర్​కు దేహశుద్ధి, రోడ్డుపై ఈడ్చుకుంటూ

Last Updated : Aug 21, 2022, 9:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.