ETV Bharat / bharat

ప్రధాని మోదీతో పంజాబ్​ ముఖ్యమంత్రి భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో(PM Modi) పంజాబ్​ ముఖ్యమంత్రి చరణ్​జీత్​ సింగ్​ చన్నీ(charanjit singh channi latest news) భేటీ అయ్యారు. నూతన సాగు చట్టాల సమస్య పరిష్కరించాలని మోదీని కోరినట్లు చన్నీ వెల్లడించారు.

modi
ప్రధాని మోదీతో పంజాబ్​ ముఖ్యమంత్రి భేటీ
author img

By

Published : Oct 1, 2021, 5:56 PM IST

Updated : Oct 1, 2021, 7:40 PM IST

పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా ఈమధ్యే బాధ్యతలు చేపట్టిన చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో (charanjit singh channi latest news) భేటీ అయ్యారు. సాయంత్రం నాలుగు గంటలకు దిల్లీలోని ప్రధాని నివాసానికి చేరుకున్న చరణ్‌జిత్‌ వ్యవసాయం, రైతుల సమస్యలపై దాదాపు గంటపాటు చర్చించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలకు వీలైనంత తొందరగా పరిష్కారం చూపించాలని ప్రధాని మోదీని కోరినట్లు చరణ్‌జిత్‌ వెల్లడించారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ధాన్యం సేకరణ చేపట్టవద్దంటూ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖపైనా చర్చించానని.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని తక్షణమే ధాన్యం కొనుగోలుకు చొరవ చూపాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయితే, పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రధానమంత్రిని (charanjit singh channi latest news) కలవడం ఇదే తొలిసారి.

channi meets modi
ప్రధాని మోదీకి గోల్డెన్​ టెంపుల్​ ప్రతిమను బహుకరిస్తున్న చన్నీ
channi meets modi
మోదీతో చన్నీ భేటీ

భారీ వర్షాల దృష్ట్యా పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో అక్టోబర్‌ 10 నుంచి ధాన్యం సేకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు సూచించింది. అయితే, ఈ సమయం కన్నా ముందే అక్టోబర్‌ 1 నుంచి రాష్ట్రంలో ధాన్యం సేకరించేందుకు అనుమతించాలని ప్రధాని మోదీని కోరినట్లు పంజాబ్‌ సీఎం వెల్లడించారు. వీటితో పాటు నూతన సాగు చట్టాలను రద్దుచేయడం, కొవిడ్‌ కారణంగా మూతబడిన కర్తార్‌పూర్‌ (kartarpur corridor news) సరిహద్దును తిరిగి తెరవాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

ఇక దిల్లీ పర్యటనలో భాగంగా పంజాబ్‌ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతోనూ సమావేశం కానున్నారు. ఇప్పటికే పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి నవజోత్‌ సింగ్‌ రాజీనామా చేయడం, కాంగ్రెస్‌ పార్టీని వీడుతానని అమరీందర్‌ సింగ్‌ ప్రకటించడం వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇలా రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై రాహుల్‌ గాంధీతో చరణ్‌జిత్‌ సింగ్‌ చర్చించే అవకాశం ఉంది.

ఇదిలాఉంటే, పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొన్న వేళ.. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ కొత్త పార్టీ పెడుతారనే వార్తలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా డజను మంది కాంగ్రెస్‌ నేతలు కెప్టెన్‌తో మంతనాలు జరుపుతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం త్వరలోనే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి : Amarinder Singh: 15రోజుల్లో అమరీందర్‌ సింగ్ కొత్త పార్టీ..?

Last Updated : Oct 1, 2021, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.