ETV Bharat / bharat

రూ.15 కోట్ల హెరాయిన్ సీజ్​.. ఆఫ్రికా మహిళ శరీరంలో 70 డ్రగ్​ క్యాప్సుల్స్​

author img

By

Published : May 4, 2022, 7:50 AM IST

Punjab Heroin Seize: పంజాబ్​లో రూ.15 కోట్లు విలువ చేసే హెరాయిన్​ను సీజ్​ చేశారు సరిహద్దు భద్రతా దళం సిబ్బంది. రెండు ప్లాస్టిక్​ బాటిళ్లలో దీన్ని గుర్తించినట్లు వెల్లడించారు.

heroin
heroin

Punjab heroin seize: పంజాబ్​ సరిహద్దులో 3 కేజీల హెరాయిన్​ను సీజ్ చేశారు బీఎస్​ఎఫ్​ సిబ్బంది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆనుకుని ఉన్న జోధావాలా గ్రామం సమీపంలో ఓ వ్యక్తి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదకద్రవ్యాల విలువ రూ.15 కోట్లు ఉంటుందని అంచనావేశారు. అబోహార్ సెక్టార్ వద్ద పెట్రోలింగ్​ నిర్వహిస్తున్న సిబ్బందికి సరిహద్దు సమీపంలో ఓ వ్యక్తి దాక్కున్నట్లు కనిపించాడు. అతనివద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా బైక్​పై పారిపోయాడు. అయితే అక్కడి వెళ్లి చూసిన సిబ్బందికి ఆకుపచ్చ వస్త్రంలో చుట్టి ఉన్న రెండు ప్లాస్టిక్​ బాటిళ్లు కనిపించాయి. తెరిచి చూడగా.. వాటిలో హెరాయిన్ ఉంది.

రాజస్థాన్​లో: ఏప్రిల్ 28న షార్జా నుంచి రాజస్థాన్ వచ్చిన ఆఫ్రికా మహిళ శరీరంలో రూ.4.7 కోట్లు విలువ చేసే 70 హెరాయిన్​ క్యాప్సుల్స్​ను గుర్తించారు అధికారులు. కోర్టు అనుమతితో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి ఐదు రోజుల తర్వాత వాటిని రికవరీ చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఉగాండా దేశస్థురాలైన ఆమె వద్ద నుంచి మొత్తం 678 గ్రాముల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే యూనిఫాం సివిల్ కోడ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.