PT Usha cheating case: భారత దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్ మాజీ క్రీడాకారిణి పీటీ ఉషపై చీటింగ్ కేసు నమోదైంది. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 420(మోసం) కింద పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసుకున్నారు.
PT Usha Jemma joseph
ఓ బిల్డర్‌తో కలిసి పీటీ ఉష తనను మోసం చేశారని జెమ్మా జోసెఫ్ ఆరోపించారు. పీటీ ఉష హామీతో కేరళ కోజికోడ్‌కు చెందిన ఓ బిల్డర్ నుంచి 1012 చదరపు అడుగుల స్థలాన్ని తాను కొనుగోలు చేశానని చెప్పారు. ఈ స్థలం ఖరీదు రూ.46 లక్షలు కాగా.. విడతలవారీగా నగదు చెల్లించినట్లు వివరించారు. అయితే, స్థలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించకుండా బిల్డర్ ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.
పీటీ ఉష సహా నిర్మాణ సంస్థకు చెందిన మరో ఆరుగురిపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. కోజికోడ్ జిల్లా పోలీస్ చీఫ్ ఏవీ జార్జ్.. పిటిషన్‌ను వెల్లాయిల్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు.
ఇదీ చదవండి: 12 గంటల వ్యవధిలో ఇద్దరు రాజకీయ నేతల హత్య