ETV Bharat / bharat

'పిల్లలకు త్వరలోనే కరోనా టీకా.. వారికే ప్రాధాన్యం' - కరోనా టీకా వార్తలు

టీకా పంపిణీలో భాగంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న పిల్లలకే (Kids Vaccine Covid India) కేంద్రం ప్రాధాన్యం ఇస్తుందన్నారు ఎన్​టీఏజీఐ ఛైర్మన్​ అరోడా. దేశంలోని అన్ని ప్రాంతాల్లో టీకాలు అందేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.

nk arora covid
'పిల్లలకు టీకా పంపిణీలో వారికే ప్రాధాన్యం'
author img

By

Published : Oct 3, 2021, 5:47 PM IST

పిల్లలకు టీకా పంపిణీకి (Kids Vaccine Covid India) సంబంధించి నేషనల్​ ఇమ్యూనైజేషన్ టెక్నికల్​ అడ్వైజరీ గ్రూప్​ (ఎన్​టీఏజీఐ) ఛైర్మన్​ డాక్టర్​ ఎన్​కే అరోడా కీలక వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న పిల్లలకే (Vaccination for Children in India) ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. టీకా ప్రాధాన్యం ఆయా పిల్లల వ్యాధి తీవ్రతపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

"దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతూ, కొవిడ్​ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్న పిల్లలను గుర్తించి వారికి మొదట వ్యాక్సిన్ అందిస్తాము. ఆ తర్వాత మిగతా పిల్లలకు టీకా పంపిణీ చేపడతాము. మరో రెండు వారాల్లో పిల్లలకు టీకా పంపిణీపై స్పష్టత వస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో టీకాలు అందేలా ఏర్పాట్లు చేస్తాము."

- డాక్టర్​ ఎన్​కే అరోడా, ఎన్​టీఏజీఐ ఛైర్మన్

ఈ ఏడాది ఆగస్టులో డ్రగ్స్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియా (డీసీజీఐ) జైడస్​ క్యాడిలా వ్యాక్సిన్​ (Zydus Cadila Vaccine News) అత్యవసర వినియోగానికి అనుమతించింది. పెద్దలకు, 12 ఏళ్లు దాటిన పిల్లల కోసం రూపొందించిన ఈ వ్యాక్సిన్​ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

ఇదీ చూడండి : పాక్​ సరిహద్దులో రూ.25 కోట్లు విలువైన డ్రగ్స్​ పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.