ETV Bharat / bharat

'అదిగో అమృత కాలం.. మరో 25 ఏళ్లలో అభివృద్ధి భారతం' - పార్లమెంట్​ జాయింట్​ బడ్జెట్ సెషన్ 2023

భారతావని వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు.. ప్రజలంతా కృషిచేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. అమృతకాలంగా భావిస్తున్న ఈ 25 ఏళ్లను దేశం ఆత్మనిర్భర్‌ భారత్‌గా మారేందుకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇదే సమయంలో ప్రజల ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నేరవేరాలని బడ్జెట్‌ సమావేశాలను ఉద్దేశించిన చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం ఎలాంటి భయాలు లేకుండా నిశ్చింతగా ఉందన్న ఆమె సమర్థ, నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని కొనియాడారు. యావత్ ప్రపంచం భారత్ వైపు ఆశగా చూస్తోందన్న రాష్ట్రపతి...అందరి ఆకాంక్షలు నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని కోరారు.

President addressesed Parliament Budget Session

author img

By

Published : Jan 31, 2023, 12:15 PM IST

Updated : Jan 31, 2023, 1:19 PM IST

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రౌపది ముర్ము తొలిసారి బడ్జెట్‌ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. తొలుత రాష్ట్రపతి భవన్‌ నుంచి సైనిక సంప్రదాయాల ప్రకారం పార్లమెంటుకు చేరుకున్నారు. రైసీనా హిల్స్‌ నుంచి అశ్వదళాలు ముందు సాగుతుండగా భారీ కాన్వాయ్‌లో ఆమె పార్లమెంటు భవనానికి తరలివచ్చారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కఢ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా రాష్ట్రపతికి స్వాగతం పలికారు.

అనంతరం ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి.. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల ఉత్సవాలు పూర్తిచేసుకున్నామని, రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకమని తెలిపారు. దేశం ఆత్మనిర్భర్‌ భారతంగా ఆవిర్భవిస్తోందన్న రాష్ట్రపతి.. పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. NDA సర్కారు గత తొమ్మిదేళ్ల పాలనతో పౌరుల ఆత్మవిశ్వాసం పెరిగిందని వివరించారు. దేశం రాబోయే పాతికేళ్లలో వికసిత భారతం దిశగా అడుగులు వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

"దేశం 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుని.. ఆజాదీ కా అమృత్‌ కాలంలోకి ప్రవేశించింది. అమృత కాలంలో వచ్చే 25 ఏళ్లు.. వందేళ్ల స్వాతంత్ర్య ఆకాంక్షల సాధనకు.. అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణానికి చాలా ముఖ్యమైనవి. ఇది యుగ నిర్మాణ సమయం. దీని కోసం మనమందరం పూర్తి సామర్థ్యంతో కార్యచరణ ప్రారంభించాలి. 2047 నాటికి.. మనం పూర్వ వైభవానికి సంబంధించిన.. ఆధునికత కలిగిన సువర్ణ అధ్యాయం కలిగిన దేశాన్ని నిర్మించాలి. మనం ఆత్మనిర్భర్‌ భారత్‌తో.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగల దేశాన్ని నిర్మించాలి"

--ద్రౌపదీ ముర్ము, రాష్ట్రపతి

అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోందని కొనియాడిన రాష్ట్రపతి..మూడు కోట్లమందికి సొంత ఇళ్లు నిర్మించినట్లు వివరించారు. మహిళా సాధికారతను చర్యలు పడుతున్నట్లు తెలియజేసిన ద్రౌపదీ ముర్ము సైన్యంలోనూ అవకాశాలు కల్పించినట్లు గుర్తుచేశారు. ఇదేసమయంలో చిన్న, సన్నకారు రైతులను ఆదుకుంటున్నట్లు పేర్కొన్న రాష్ట్రపతి..కనీస మద్దతు ధర పెంచి రైతులను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాలు, సరిహద్దు గ్రామాల్లో రక్షణ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

"సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ పేరిట సేవ చేసేందుకు దేశ ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. దీనిలో మేం సబ్‌కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌, సబ్‌ కా ప్రయాస్‌ కూడా జోడించాం. ఈ మంత్రమే ఇప్పుడు అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి ప్రేరణగా నిలుస్తోంది. అభివృద్ధి పథంలో మా ప్రభుత్వం తొమ్మిదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. మా ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనలో భారత ప్రజలు సంపూర్ణ మార్పులను తొలిసారి చూశారు. దేశంలో అతిపెద్ద మార్పు ఏంటంటే ఇప్పుడు భారత్‌ ఆత్మవిశ్వాసం అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ప్రపంచం భారత్‌ను భిన్నంగా చూస్తోంది. భారత్‌ కూడా గతంలో చాలా సమస్యల పరిష్కారం కోసం వేరే దేశాలపై ఆధారపడేది. కానీ ఇప్పుడు ప్రపంచంలోని చాలా ప్రశ్నలకు భారత్‌ సమాధానంగా మారింది."

--ద్రౌపదీ ముర్ము, రాష్ట్రపతి

అవినీతి అంతం దిశగా దేశం అడుగులేస్తోందన్న రాష్ట్రపతి.. బినామీ ఆస్తుల స్వాధీనం దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

"ప్రజాస్వామ్యానికి, సామాజిక న్యాయానికి అవినీతి అతి పెద్ద శత్రువన్నది మా ప్రభుత్వ స్పష్టమైన అభిప్రాయం. అవినీతికి వ్యతిరేకంగా కొన్నేళ్లుగా నిరంతర పోరాటం జరుగుతోంది. అవినీతిపరులకు సమాజంలో ఎలాంటి సానుభూతి ఉండదు. దీనిపై సమాజంలో కూడా చైతన్యం పెరుగుతోంది. అవినీతి రహిత వాతావరణాన్ని కల్పించే దిశగా బినామీ ఆస్తుల స్వాధీనం చట్టాన్ని తెచ్చాం. ఆర్థిక నేరగాళ్లు, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు ఫుజిటివ్‌ ఎకనమిక్‌ అఫెండర్స్‌ యాక్ట్‌ను అమల్లోకి తెచ్చాం. అవినీతిని అంతం చేసేందుకు ప్రభుత్వం కూడా సమర్థ యంత్రాంగాన్ని రూపొందించింది"

--ద్రౌపదీ ముర్ము, రాష్ట్రపతి

సర్జికల్‌ స్ట్రైక్‌ ద్వారా సరిహద్దులు దాటి ముష్కర మూకలను మట్టుబెట్టినట్లు గుర్తుచేసిన రాష్ట్రపతి.. ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. సాంకేతికంగానూ భారత్ కొత్త పుంతలు తొక్కుతోందన్న ఆమె.. భారత డిజిటల్‌ నెట్‌వర్క్‌ వ్యవస్థ ప్రపంచానికే ఉదాహరణగా మారిందని వివరించారు.

Last Updated : Jan 31, 2023, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.