ETV Bharat / bharat

కూతురి మృతదేహంతో 3 రోజులు ఇంట్లోనే.. బతికించడానికి పూజలు! - crime news

చనిపోయిన కుమార్తె మృతదేహాన్ని మూడు రోజులుగా ఇంట్లో పెట్టుకొని కూర్చున్నారు ఆమె తల్లిదండ్రులు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తున్నా అలాగే ఉంచారు. చనిపోయిన యువతిని బతికించడానికి క్షుద్రపూజలు సైతం చేశారు. ఉత్తర్​ప్రదేశ్​లోని ఈ ఘటన వెలుగుచూసింది. మధ్యప్రదేశ్​లో జరిగిన మరో ఘటనలో మద్యం మత్తులో కన్నతండ్రినే హత్య చేశాడు కొడుకు.

crime news
crime news
author img

By

Published : Jun 29, 2022, 2:58 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రయాగరాజ్​లో హృదయవిదారక ఘటన జరిగింది. చనిపోయిన కుమార్తె మృతదేహాన్ని మూడు రోజులుగా ఇంట్లోనే పెట్టుకుని కూర్చున్నారు ఆమె తల్లిదండ్రులు. అంతేకాకుండా బతికించడానికి క్షుద్రపూజలు కూడా చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఏం జరిగిందంటే?.. జిల్లాలోని కర్ఛన ప్రాంతంలోని డీహా గ్రామంలో 18 ఏళ్ల దీపిక మూడు రోజుల క్రితం చనిపోయింది. ఎవరికీ చెప్పకుండా ఈ విషయాన్ని దాచారు యువతి కుటుంబసభ్యులు. మూడు రోజులుగా అలాగే ఉండటం వల్ల.. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వచ్చింది. అది గమనించిన చుట్టుపక్కవారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వచ్చిన పోలీసులు.. ఇంటి లోపలకు వెళ్లి అక్కడ జరుగుతున్న దృశ్యాలను చూసి షాకయ్యారు.

చనిపోయిన యువతిని బతికించడానికి ఆమె కుటుంబమంతా క్షుద్రపూజలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు.. యువతి మృతదేహాన్ని ఇంటి నుంచి బయటకు తెచ్చి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల మానసిక పరిస్థితి బాగాలేదని, వారిని ముందుగా విచారించి ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

మద్యం మత్తులో తండ్రిని చంపిన కొడుకు.. మధ్యప్రదేశ్​లో దారుణ ఘటన జరిగింది. కన్నతండ్రిని హత్య చేసి ఆపై ఓ ప్లాస్టిక్​ సంచిలో మృతదేహాన్ని బైక్​పై తీసుకెళ్తున్న కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాధితుడ్ని రాంలాల్​గా గుర్తించారు.

పోలీసులు వివరాల ప్రకారం.. పనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్జయ్య గ్రామంలో రాంలాల్​(50) అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. తాజాగా అతడి కుమారుడు అమన్​..​ మద్యం తాగొచ్చి తండ్రితో తీవ్రంగా గొడవపడ్డాడు. ఆపై గొంతు కోసి హత్య చేశాడు. అనుమానం రాకుండా ఉండడానికి తన తండ్రి మృతదేహాన్ని ప్లాస్టిక్​ సంచిలో వేసుకుని.. మోటార్​ సైకిల్​పై బయలుదేరాడు అమన్​.

మహరాజ్​పుర్​ ప్రాంతంలో అతడ్ని గమనించిన పోలీసులు.. అనుమానం వచ్చి బైక్​ను ఆపారు. 'ప్లాస్టిక్​ సంచిలో ఏమున్నాయి?' అని అడగ్గా కూరగాయలను తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. దీంతో మరింత అనుమానం పెంచుకున్న పోలీసులు.. సంచిని తెరచి చూసి షాకయ్యారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. నిజాన్ని ఒప్పుకున్నాడు. తండ్రిని తానే హత్య చేశానని పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

ఇవీ చదవండి: ఆ విషయం మర్చిపోయిన అక్క.. తమ్ముడికి సారీ చెబుతూ 434మీటర్ల లేఖ!

అంబానీ కుటుంబ భద్రతపై సుప్రీం కీలక ఆదేశాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.