ETV Bharat / bharat

'కాంగ్రెస్ నా ట్రాక్ రికార్డ్​ను దెబ్బతీసింది.. అందుకే వారితో పనిచేయను' - ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్

Prashant Kishor on congress: కాంగ్రెస్ పార్టీ తాను మునిగిపోవడమే కాకుండా.. తోటివారినీ ముంచేస్తోందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు. 2017 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పనిచేసి ఓడిపోయినట్లు చెప్పిన ఆయన.. దీని ఫలితంగానే ఆ పార్టీతో పనిచేయకూడదని నిశ్చయించుకున్నట్లు చెప్పారు.

PRASHANT KISHORE CONGRESS
PRASHANT KISHORE CONGRESS
author img

By

Published : May 31, 2022, 8:04 PM IST

Prashant Kishor on congress: కాంగ్రెస్ పార్టీ తన ట్రాక్ రికార్డును దెబ్బతీసిందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. అందుకే ఆ పార్టీతో పనిచేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బిహార్ రాష్ట్రంలో మార్పు కోసం ప్రయత్నించనున్నట్లు ఇటీవల ప్రకటించిన ఆయన.. వైశాలి జిల్లాలో సోమవారం ఓ సమావేశంలో పాల్గొన్నారు. 2011 నుంచి 2021 మధ్య 11 ఎన్నికలతో నేను భాగస్వామ్యమైనట్లు పేర్కొన్న ఆయన.. ఒక్కదాంట్లోనే ఓడిపోయినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​పై కీలక వ్యాఖ్యలు చేశారు.

"2015లో బిహార్​లో మహాఘట్​బంధన్​ను గెలిపించాం. 2016లో పంజాబ్ ఎన్నికల్లో గెలిచాం. 2019లో ఏపీ, 2020లో దిల్లీ, 2021లో తమిళనాడు, బంగాల్​ రాష్ట్రాల్లో గెలిచాం. 2017లో యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్​తో కలిసి పనిచేశాం. అక్కడ ఓడిపోయాం. అందువల్లే కాంగ్రెస్​తో పనిచేయకూడదని అనుకున్నా. ఆ పార్టీ ఎలా ఉందంటే.. వారు మునిగిపోవడమే కాకుండా మనల్ని కూడా ముంచేస్తున్నారు. పదేళ్లలో 11 ఎన్నికల్లో నేను పాల్గొంటే ఒక్కటే.. అది కూడా కాంగ్రెస్​తో కలిసినప్పుడే ఓడిపోయా. నా ట్రాక్ రికార్డును వారు దెబ్బతీశారు."
-ప్రశాంత్ కిశోర్, ఎన్నికల వ్యూహకర్త

Prashant Kishor congress track record: గతంలో కాంగ్రెస్​లో ప్రశాంత్ కిశోర్ చేరతారని పలుమార్లు ఊహాగానాలు వచ్చాయి. ఓసారి సోనియా గాంధీతోనూ భేటీ అయ్యారు. పార్టీలో చేపట్టాల్సిన మార్పుల గురించి పలు సూచనలు చేశారు. అయితే, కొన్ని కారణాల వల్ల పార్టీలో చేరలేదు పీకే. అనంతరం బిహార్ రాజకీయాల్లో చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నారు. ఆ రాష్ట్రానికి చెందిన 17- 18 వేల మంది ప్రముఖుల్ని కలిసి మాట్లాడనున్నట్లు గతంలో వివరించారు పీకే. అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని పాదయాత్ర ప్రకటించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.