ETV Bharat / bharat

రాహుల్​తో పీకే భేటీ- ఆ ఎన్నికలపై చర్చ! - prashant kishore rahul gandhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. దిల్లీలోని రాహుల్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్​ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

PK meet Rahul Gandhi
రాహుల్​తో పీకే భేటీ
author img

By

Published : Jul 13, 2021, 6:01 PM IST

Updated : Jul 13, 2021, 8:32 PM IST

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌.. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. ఎన్​సీపీ అధినేత శరద్‌పవార్‌తో సమావేశమైన కొన్నిరోజుల తర్వాత రాహుల్‌తో ఆయన భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. దిల్లీలోని రాహుల్‌ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌, పంజాబ్ కాంగ్రెస్ ఇంఛార్జి హరీష్ రావత్ కూడా పాల్గొన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీ, పంజాబ్‌ శాసనసభ ఎన్నికలపై వీరంతా చర్చించినట్లు సమాచారం.

కూటమిపై?

గత నెల 11న ముంబయిలో మొదటిసారి శరద్‌ పవార్‌తో సమావేశమైన ప్రశాంత్‌ కిశోర్‌.. అదే నెల 21న రెండోసారి దిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. దాదాపు 3గంటల పాటు పవార్‌-ప్రశాంత్‌ కిశోర్ ఏకాంతంగా సమాలోచనలు జరపటం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలతో కూటమి ఏర్పాటు అంశంపైనే పవార్‌-ప్రశాంత్‌ కిశోర్ చర్చించినట్లు ప్రచారం జరిగింది. కాంగ్రెస్‌ లేకుండా జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు అసాధ్యమని పవార్‌ పేర్కొన్న నేపథ్యంలో... రాహుల్‌ గాంధీని ప్రశాంత్‌ కిశోర్‌ కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది.

పంజాబ్ వర్గపోరుపైనే చర్చ!

పంజాబ్ కాంగ్రెస్​లో సంస్థాగత మార్పులు చేపట్టనున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం విశేషం. గంటపాటు జరిగిన ఈ సమావేశంలో ఏం చర్చించారనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల అంశమే ప్రధానంగా సాగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ రాష్ట్ర కాంగ్రెస్​లో ఏర్పడిన వర్గపోరును అసెంబ్లీ ఎన్నికలకు ముందే నివారించే విషయమై నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

పంజాబ్​లో సీఎం అమరిందర్ సింగ్, నవ్​జోత్ సింగ్ సిద్ధూ మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నాయి. గత కొద్దికాలం నుంచి ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. దీనిపై ఇరువురు పార్టీ అధిష్ఠానాన్ని కలిసి తమ వాదనను వినిపించారు. పంజాబ్ పీసీసీ పోస్ట్ కోసం సిద్ధూ పట్టుబడుతుండగా.. సీఎం దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదే వీరిద్దరి మధ్య వైరుధ్యానికి కారణంగా తెలుస్తోంది.

ఇదీ చదవండి: 'ఆమెకు విడాకులిస్తేనే నీకు ఎమ్మెల్యే పదవి!'

Last Updated : Jul 13, 2021, 8:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.