ETV Bharat / bharat

కొత్త ట్విస్ట్.. 'భాజపా కోసం పనిచేస్తున్న PK.. పాదయాత్రకు నిధులు కూడా..!'

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​.. భాజపా కోసం పని చేస్తున్నారా? భారీ ఖర్చు, ప్రచార ఆర్బాటంతో ఆయన చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రకు కేంద్రంలోని పెద్దల అండ ఉందా? ఔననే అంటోంది బిహార్​లోని అధికార పక్షమైన జేడీయూ.

Prashant Kishor jan suraj pad yatra
కొత్త ట్విస్ట్.. 'భాజపా కోసం పనిచేస్తున్న PK.. పాదయాత్రకు నిధులు కూడా..!'
author img

By

Published : Oct 4, 2022, 9:34 AM IST

జన సురాజ్​ పేరిట సామాజిక సంస్థను స్థాపించి, బిహార్​లో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. భాజపా కోసమే పనిచేస్తున్నారని జేడీయూ ఆరోపించింది. పీకే అక్టోబర్​ 2న ప్రారంభించిన 3,500 కిలోమీటర్ల పాదయాత్రకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించింది. జేడీయూ బిహార్ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్.. ఈమేరకు ప్రశాంత్​పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బిహార్ ఇంకా వెనుకబడే ఉందన్న ఆరోపణల్ని తిప్పికొట్టారు.

"నీతీశ్ కుమార్ పాలనలో బిహార్​ ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలకు తెలుసు. ప్రశాంత్ కిశోర్​ మాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పని లేదు. ఇతర పౌరుల్లా ఆయన కూడా పాదయాత్ర చేపట్టవచ్చు. ప్రచార కార్యక్రమానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కానీ.. ఆయన భాజపా తరఫునే పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది.

ప్రచారం కోసం ఆయన చేస్తున్న ఖర్చు అనుమానాలకు తావిస్తోంది. బడా పార్టీలు కూడా పత్రికల్లో ఫుల్​ పేజీ ప్రకటనలు ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. కానీ.. ఆయన పాదయాత్ర కోసం ఆదివారం ఆ పని చేశారు. ఆదాయ పన్ను శాఖ, సీబీఐ, ఈడీ ఈ విషయాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు? ఆయనకు కేంద్రప్రభుత్వంలోని వారి మద్దతు ఉండడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది" అని ఆరోపించారు లలన్.

జేడీయూలో ఒకప్పుడు పీకే కీలక పాత్ర
నిజానికి.. కొన్నేళ్ల క్రితమే పీకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. బిహార్​లోని అధికార పక్షం జేడీయూ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఎక్కువ కాలం కొనసాగలేదు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జేడీయూ అధిష్ఠానం ఆయన్ను 2020 జనవరిలో బహిష్కరించింది. ఆ తర్వాత పీకే బిహార్ లో 'జన్ సురాజ్' పేరుతో ఒక సామాజిక సంస్థను స్థాపించారు. ఈ వేదిక పేరు మీదే ఆయన ఈ పాదయాత్ర చేపడుతున్నారు.

అయితే.. భారీ లక్ష్యాలు, అందుకు తగిన ఏర్పాట్లతో గాంధీ జయంతి నాడు(ఆదివారం) పాదయాత్ర ప్రారంభించిన ప్రశాంత్ కిశోర్ బృందానికి తొలిరోజే నిరాశ ఎదురైంది. పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసినా.. అనుకున్న స్థాయిలో జనం రాలేదు. మైదానం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. సభా ప్రాంగణంలో కనిపించినవారిలో కొందరు.. పీకే కోసం రాలేదని, అక్కడి గాంధీ ఆశ్రమ సందర్శన కోసం వచ్చినవారన్నది స్థానికుల మాట. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.