ETV Bharat / bharat

పోలీస్‌ స్టేషన్‌పై రాకెట్​ లాంచర్​తో దాడి!.. ఉగ్రవాదుల కుట్రగా అనుమానం..! - bomb attack in india

పంజాబ్‌లోని ఓ పోలీస్‌ స్టేషన్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీస్‌ స్టేషన్‌ స్వల్పంగా ధ్వంసమైంది. ఇదీ పాకిస్థాన్‌, ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల కుట్రగా పోలీసులు ‌అనుమానిస్తున్నారు.

police station attacked by terrorists in Punjab
పోలీస్‌ స్టేషన్‌పై బాంబు దాడి
author img

By

Published : Dec 10, 2022, 1:08 PM IST

పంజాబ్‌లోని తర్న్‌ తరన్‌లో పోలీస్‌ స్టేషన్‌పై రాకెట్‌ లాంచర్‌ తరహా ఆయుధంతో దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ భవనం వెలుపల ఉన్న ఓ స్తంభానికి తగిలి, రాకెట్‌ లాంఛర్‌ వెనుకకు వెళ్ళడంతో పెను ముప్పు తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోలీస్‌ స్టేషన్‌ స్వల్పంగా ధ్వంసమైంది. దాడి జరిగిన పోలీస్‌ స్టేషన్‌ను పంజాబ్‌ డీజీపీ, ఫోరెన్సిక్‌ నిపుణులు పరిశీలించారు. గత ఏడు నెలల్లో పోలీస్ స్టేషన్‌పై ఇది రెండో దాడని అధికారులు తెలిపారు. దాడి వెనక పాకిస్థాన్‌, ఖలిస్థాన్‌ ఉగ్రవాదుల కుట్ర ఉండొచ్చని పోలీసులు ‌అనుమానిస్తున్నారు.

ఆర్పీజీని ఉపయోగించి ఈ దాడి చేసినట్లుగా పోలీసులు తెలిపారు. రాత్రి 11.22 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు వారు వెల్లడించారు. హైవేపై నుంచి గ్రెనేడ్ పేల్చినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పంజాబ్​ డీజీపీ గౌరవ్​ యాదవ్​ తెలిపారు. ఉగ్రవాద ఉనికిని చాటడం కోసమే పాకిస్థాన్ ఐఎస్ఐ ఈ దాడి చేయించిందన్న అనుమానం ఉందని అధికారులు తెలిపారు. పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి శాంతి భద్రతలు క్షీణించాయని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.