ETV Bharat / bharat

'ప్రతి ఇంటికి ఎల్​పీజీ కనెక్షన్​​ ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం​' - ఉజ్వలా 2.0

ప్రతీ ఇంట్లో ఎల్​పీజీ గ్యాస్​ స్టవ్​ ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉజ్వల 2.0 పథకాన్ని ఉత్తర్​ప్రదేశ్​లో వర్చువల్​గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిరుపేదలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు అందించారు.

narendra modi
నరేంద్ర మోదీ
author img

By

Published : Aug 10, 2021, 2:02 PM IST

ఉజ్వల 2.0 (ప్రధానమంత్రి ఉజ్వల యోజన) పథకాన్ని ఉత్తర్​ప్రదేశ్​లోని మహోబా జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్​గా ప్రారంభించారు. లబ్ధిదారులైన మహిళలకు ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​లను అందజేశారు. పథకాలు, వనరుల ద్వారా ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రతీ ఇంట్లో ఎల్​పీజీ గ్యాస్​ స్టవ్​ ఉండాలని సంకల్పించినట్లు తెలిపారు.

" రహదారులు, విద్యుత్, ఆరోగ్యం, ఎల్‌పీజీ వంటి ప్రాథమిక అవసరాలను గత ప్రభుత్వాలు తీర్చడం కోసం ప్రజలు దశాబ్దాలు వేచి ఉండాల్సి వచ్చింది. 2014కు ముందు ప్రభుత్వ పథకాలు పొందడానికి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ క్రీడల గురించి కూడా మాట్లాడారు. హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పేరుతో ఖేల్​రత్న అవార్డు పేరును మార్చినట్లు తెలిపారు. ఈ నిర్ణయం క్రీడల్లో కొనసాగించాలనుకునే లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఒలింపిక్స్‌లో అథ్లెట్లు పతకాలు సాధించడం.. భారతీయ క్రీడల ఉజ్వల భవిష్యత్తుకు సంకేతమని అన్నారు.

ఇదీ చూడండి: World Lion Day: 'గత కొన్నేళ్లలో సింహాల సంఖ్య పెరిగింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.