ETV Bharat / bharat

'మొసలిని పట్టుకున్న మోదీ'.. పాఠ్యాంశంగా ప్రధాని సాహసం! - మోదీ సాహసం పాఠంగా

ప్రధాని నరేంద్ర మోదీ బాల్యంలో చూపిన ధైర్యసాహసాలను పాఠ్యాంశంగా మార్చింది ఓ పాఠశాల. చిన్నతనంలో మోదీ మొసలి పిల్లను ఇంటికి తెచ్చిన సంఘటనను తమిళనాడులోని ఓ ప్రైవేట్​ పాఠశాల ఒకటో తరగతి విద్యార్థులకు పాఠంగా ప్రవేశపెట్టింది.

modi crocodile story
మొసలిపిల్లను ఇంటికి తెచ్చిన మోదీ.. ప్రధాని సాహసం పాఠ్యంశంగా..
author img

By

Published : Jun 19, 2022, 1:16 PM IST

Updated : Jun 19, 2022, 1:57 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్నతనంలో చేసిన ఓ సాహసాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రైవేట్​ పాఠశాల యాజమాన్యం ఒకటో తరగతి విద్యార్థులకు దీనినే పాఠంగా పొందుపర్చింది. 2019లో ఓ టీవీ ప్రోగ్రామ్​లో మాట్లాడిన మోదీ.. "నేను కొలనులో స్నానం చేస్తుండగా.. ఓ మొసలి పిల్లను చూశాను. దానిని ఇంటికి తీసుకుని వెళ్లాను. మా అమ్మ దాన్ని చూసి తిట్టడం వల్ల తిరిగి ఆ కొలనులోనే వదిలిపెట్టి వచ్చాను" అని మోదీ చెప్పారు.

modi crocodile story
పాఠ్యాంశంగా ప్రధాని సాహసం

మొసలి పిల్లను ఇంటికి తీసుకువచ్చిన సన్నివేశాన్ని ఉదాహరణగా చూపించిన యాజమాన్యం.. 'నరేంద్ర దామోదర్​దాస్​ మోదీ భారత దేశానికి 14వ, ప్రస్తుత ప్రధానమంత్రి. ఆయన చిన్నతనం నుంచే ధైర్యసాహసాలను ప్రదర్శించేవారు. బాల్యంలోనే ఓ మొసలి పిల్లను ఇంటికి పట్టుకువచ్చార'ని పుస్తకంలో ప్రచురించింది. ప్రధానమంత్రి యావత్​ దేశానికి పర్యవేక్షకుడని ముద్రించింది.

ప్రధాన మంత్రి చిన్నతనంలోని సాహసాలను ప్రచురించడం ఇది తొలిసారి కాదు. అంతకుముందు రన్నడే ప్రకాశన్​ 'బాల్​ నరేంద్ర - చైల్డ్ స్టోరీస్​ ఆఫ్​ నరేంద్ర మోదీ' పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించారు. ఇందులో మోదీ బాల్యంలో చేసిన అనేక సాహోసోపేత విషయాలను వెల్లడించారు. ఈ కథల్లో ఒకటి పాఠకులను విస్మయానికి గురిచేసింది. 'మోదీ ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు కొలనులో స్నానం చేస్తుండగా ఓ మొసలి దాడి చేసింది. ఈ ప్రమాదంలో మోదీ కాలికి గాయం కాగా.. తొమ్మిది కుట్లు పడ్డాయి.' అన్నది ఆ కథ సారాంశం.

ఇదీ చదవండి: అగ్నిపథ్​ రిక్రూట్​మెంట్​.. వాయుసేన కీలక ప్రకటన!

Last Updated : Jun 19, 2022, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.