భారత 15వ రాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన ద్రౌపదీ ముర్ముకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ద్రౌపదీ ముర్ము నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి ఆమె నివాసానికి వెళ్లిన మోదీ.. పుష్పగుఛ్చం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. 130 కోట్ల భారతీయులు 'అజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకలు జరుపుకొంటున్న ఈ తరుణంలో.. ఓ ఆదివాసీ, గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళ రాష్ట్రపతిగా ఎన్నికవడం ఆనందంగా ఉందన్నారు మోదీ. ఝార్ఖండ్ గవర్నర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అద్భుతంగా పనిచేశారని కొనియాడారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కూడా ముర్ము శుభాకాంక్షలు చెప్పారు. రాజ్యాంగ సంరక్షురాలిగా ఎలాంటి పక్షపాతాలు, భయాలు లేకుండా పనిచేయాలని ఆకాంక్షించారు. రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్.. ద్రౌపదీ ముర్ముకు అభినందనలు తెలిపారు. ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత పీఠంపై కూర్చోవడం.. ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనమన్నారు. భారతదేశం గర్వించేలా ద్రౌపదీ ముర్ము పనిచేస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మరోవైపు ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికవడం వల్ల ఆమె ఇంటి వద్ద సంబరాలు హోరెత్తాయి. ఆమె ఇంటి వద్ద ఆదివాసీలు సంప్రదాయ నృత్యాలతో వేడుకలు చేసుకుంటున్నారు.
-
Heartiest congratulations to Smt. Droupadi Murmu Ji on being elected as the 15th President of India! Her wide experience in public life, spirit of selfless service and deep understanding of people's issues will greatly benefit the nation.
— Vice President of India (@VPSecretariat) July 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
My best wishes for a successful tenure!
">Heartiest congratulations to Smt. Droupadi Murmu Ji on being elected as the 15th President of India! Her wide experience in public life, spirit of selfless service and deep understanding of people's issues will greatly benefit the nation.
— Vice President of India (@VPSecretariat) July 21, 2022
My best wishes for a successful tenure!Heartiest congratulations to Smt. Droupadi Murmu Ji on being elected as the 15th President of India! Her wide experience in public life, spirit of selfless service and deep understanding of people's issues will greatly benefit the nation.
— Vice President of India (@VPSecretariat) July 21, 2022
My best wishes for a successful tenure!
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నూతనంగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె అనుభవం, నిస్వార్థ సేవా స్ఫూర్తి, ప్రజా సమస్యలపై లోతైన అవగాహన దేశానికి ఎంతో మేలు చేస్తాయని కొనియాడారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ద్రౌపదీ ముర్ముకు అభినందనలు తెలిపారు. ఆమెకు ఓటు వేసిన ఎన్డీఏ పక్షాలకు, మిగతా పార్టీలకు ధన్యవాదాలు చెప్పారు. ముర్ము తన పదవీ కాలంలో దేశం గర్వపడేలా పనిచేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నూతనంగా ఎన్నికైన రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చదవండి: ద్రౌపదీ ముర్ము ఘన విజయం.. రాష్ట్రపతి పీఠం ఎక్కుతున్న తొలి ఆదివాసీ మహిళ
మమత ట్విస్ట్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు టీఎంసీ దూరం.. అదే కారణం!