ETV Bharat / bharat

108 అడుగుల హనుమాన్​ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ - పీఎం మోదీ

hanuman statue in morbi: హనుమాన్​ జయంతి సందర్భంగా 108 అడుగుల ఎత్తైన హనుమాన్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. హనుమాన్​ చార్​ధామ్​ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్​లోని మోర్బీలో ఈ విగ్రహాన్ని నిర్మించారు. అంతకుముందు దేశ ప్రజలకు హనుమాన్​ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని.

PM Modi
హనుమాన్​ విగ్రహం
author img

By

Published : Apr 16, 2022, 12:44 PM IST

Updated : Apr 16, 2022, 12:54 PM IST

hanuman statue in morbi: హనుమాన్​ జయంతి సందర్భంగా గుజరాత్​లోని మోర్బీ ప్రాంతంలో 108 అడుగుల ఎత్తైన హనుమాన్​ విగ్రహాన్ని వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కొన్నేళ్లుగా షిమ్లాలో ఇలాంటి భారీ విగ్రహాన్ని చూస్తున్నామని, ప్రస్తుతం రెండోది మోర్బీలో ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. త్వరలోనే రామేశ్వరం, బంగాల్​లో మరో రెండు భారీ హనుమాన్​ విగ్రహాలు నిర్మించనున్నట్లు చెప్పారు.

Hanuman statue in Morbi Gujarat
హనుమాన్​ విగ్రహం ఆవిష్కరిస్తున్న మోదీ

"దేశంలోని వేరు వేరు ప్రాంతాల్లో రామ కథ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఏ భాష అయినా.. రామ కథ స్ఫూర్తి అందరిని ఒక్కటి చేస్తుంది. అది దైవత్వానికి చేరువ చేస్తుంది. ఇదే భారత దేశ నమ్మకం, ఆధ్యాత్మికత, సంప్రదాయం, సంస్కృతికి బలం. చెడుపై మంచి విజయం సాధించేందుకు రాముడు విశేషంగా కృషి చేశారు. అందుకోసం అందరిని కలుపుకొని వెళ్తూ, సమాజంలోని ప్రతి వర్గంలోని ప్రజలను అనుసంధానిస్తూ చెడుపై విజయం సాధించారు. అదే విధంగా అందరి ప్రయత్నాలు ఉండాలి. భారత్ ప్రస్తుత తరుణంలో​ స్తబ్దుగా ఉండిపోవలనుకోవట్లేదు. ఉన్నచోటే ఉంటే ముందుకు సాగలేం. ప్రపంచం మొత్తం ఆత్మనిర్భరత గురించే ఆలోచిస్తోంది. స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేసేలా దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేయాలని ఆధ్యాత్మికవేత్తలను కోరుతున్నా. మనం ఇంట్లో మన ప్రజలు చేసిన వస్తువులనే వాడాలి. దీని వల్ల ఉపాధి పొందేవారి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందో ఓసారి ఊహించండి. స్థానిక ఉత్పత్తులనే వినియోగిస్తే వచ్చే 25 ఏళ్లలో నిరుద్యోగమనేదే ఉండదు. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హనుమంతుడు శక్తి, ధైర్యం, సంయమనానికి.. ప్రతీక అని పేర్కొన్నారు. ఆంజనేయుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాలు.. శక్తి, జ్ఞానంతో నిండిపోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.

Hanuman statue in Morbi Gujarat
108 అడుగుల హనుమాన్​ విగ్రహం

హనుమాన్​ చార్​ధామ్​ ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా నాలుగు దిశల్లో నిర్మించ తలపెట్టిన విగ్రహాల్లో.. మోర్బీలో ఏర్పాటు చేసింది రెండోది. మోర్బీలోని బాపు కేశవానంద జీ ఆశ్రమానికి పడమర వైపున ఈ భారీ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిరీస్​లో తొలి విగ్రహం ఉత్తర భారతంలోని హిమాచల్​ ప్రదేశ్​ షిమ్లాలో 2010లో నెలకొల్పారు. రామేశ్వరంలో నిర్మించే మూడో విగ్రహం పనులు మొదలైనట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.

ఇదీ చూడండి: మదురై 'చిథిరై' ఉత్సవాల్లో తొక్కిసలాట.. ఇద్దరు మృతి

Last Updated : Apr 16, 2022, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.