ETV Bharat / bharat

'ఇంటింటికీ టీకా'.. కరోనాపై పోరులో మోదీ నయా నినాదం

దేశంలో వ్యాక్సినేషన్ వేగం తగ్గడం మంచిది కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. 100 కోట్ల డోసులు పంచేశామని అజాగ్రత్త వహించడం తగదని అన్నారు. టీకా పంపిణీ పలు జిల్లాల్లో నెమ్మదిగా సాగడంపై సమీక్ష(Modi meeting today) నిర్వహించారు. 40 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

modi review meeting on vaccination
modi review meeting on vaccination
author img

By

Published : Nov 3, 2021, 1:49 PM IST

Updated : Nov 3, 2021, 2:22 PM IST

వైద్యులు, వైద్య సిబ్బంది, అధికారుల కృషి వల్లే వ్యాక్సినేషన్​లో దేశం ఈ స్థాయిలో పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జిల్లా అధికారుల నుంచి.. ఆశావర్కర్ల వరకు ప్రతి ఒక్కరూ టీకా పంపిణీ కోసం పాటు పడ్డారని కొనియాడారు. వ్యాక్సినేషన్ కవరేజీ తక్కువగా ఉన్న 40 జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం (Modi meeting today) నిర్వహించిన ఆయన... 100 కోట్ల డోసులు పంచేశామని అజాగ్రత్త వహిస్తే.. మరో సంక్షోభం ముంచుకొచ్చే ప్రమాదం (Modi news today) ఉందన్నారు.

వ్యాక్సిన్ పంపిణీలో అపోహలు, పుకార్ల రూపంలో సవాళ్లు ఎదురవుతాయని మోదీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత మందికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం స్థానిక మతపెద్దల సహాయం తీసుకోవాలని సూచించారు. గ్రామ, పట్టణాల స్థాయిలో వినూత్న పద్ధతులు పాటించి వ్యాక్సినేషన్ వేగం పెంచాలని అన్నారు. ఇంటింటికీ వెళ్లి టీకాలు ఇవ్వాలని అధికారులకు ప్రధాని నిర్దేశించారు. రెండు డోసుల రక్షణ పొందనివారిని గుర్తించాలని చెప్పారు.

"వ్యాధులను, శత్రువులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. చివరి వరకు మనం పోరాడాలి. కొంచెం కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. ఇది(కొవిడ్19) వందేళ్లలో అతిపెద్ద మహమ్మారి. దీని వల్ల దేశం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. కరోనాపై పోరాడేందుకు కొత్త పరిష్కారాలు కనుక్కోవడం చాలా గొప్ప విషయం. మీ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కవరేజీ పెంచేందుకు మీరు కూడా వినూత్న పద్ధతులను పాటించాలి. అవసరమైతే గ్రామ, పట్టణాల స్థాయిలో 20-25 మందితో బృందాలు ఏర్పాటు చేయవచ్చు. వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా చూడొచ్చు. ఇప్పటివరకు వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి.. సురక్షితంగా టీకాలు ఇచ్చారు. ఇప్పుడు 'హర్ ఘర్ టీకా.. ఘర్ ఘర్ టీకా'(ఇంటింటికి టీకా) స్ఫూర్తితో ప్రతి ఇంటికి వెళ్లి టీకాలు ఇవ్వండి."

-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో.. తొలి డోసు కవరేజీ 50 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాల అధికారులు పాల్గొన్నారు. ఇటీవలే జీ20, కాప్26 సదస్సులకు హాజరైన మోదీ.. భారత్​కు తిరిగి వచ్చిన వెంటనే ఈ సమావేశం నిర్వహించారు.

ఝార్ఖండ్, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్​ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. టీకా పంపిణీ తక్కువగా ఉన్న 40 జిల్లాల్లో చాలా వరకు ఈ రాష్ట్రాలకు చెందినవే ఉన్నాయని ప్రధాని కార్యాలయం తెలిపింది.

రెండో డోసు వేసుకోలేదు..

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం (Vaccination in India) వేగంగానే సాగుతోంది. ఇప్పటికి 107 కోట్ల డోసులు పంపిణీ చేశారు. అయితే, కొంతమంది లబ్ధిదారులు తమ రెండో డోసు తీసుకోవడం లేదు. 10.34 కోట్ల మంది తమ రెండో డోసును నిర్దేశిత సమయంలో తీసుకోలేదని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ తెలిపారు.

ఇదీ చదవండి: India cases: దేశంలో కొత్తగా 11,903 కరోనా కేసులు

Last Updated : Nov 3, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.