ETV Bharat / bharat

భారత అమ్ములపొదిలోకి స్వదేశీ యుద్ధనౌక విక్రాంత్.. శత్రుదేశాలకు చుక్కలే!

రక్షణ రంగంలో ఎన్నో ఘనతలు సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన భారత్‌, శుక్రవారం మరో మైలురాయిని అందుకోనుంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయుల శ్రమ, మేధస్సుతో రూపుదిద్దుకున్న తొలి విమాన వాహక యుద్ధనౌక ఐఎన్​ఎస్​-విక్రాంత్ ప్రధాని మోదీ చేతుల మీదుగా లాంఛనంగా నౌకాదళంలో చేరనుంది. బాహుబలి యుద్ధనౌకగా పేరుగాంచిన.. ఐఎన్​ఎస్​-విక్రాంత్ రాకతో హిందూ మహాసముద్ర జలాల్లో భారత తీర ప్రాంతం మరింత దుర్బేధ్యం కానుంది. ఇంతకీ ఈ యుద్ధ నౌక గొప్పదనం ఏమిటి? భారతీయుల సత్తా చాటిచెప్పే ప్రత్యేకతలు ఇందులో ఏమున్నాయో ఓసారి చూద్దాం.

INS Vikrant
INS Vikrant
author img

By

Published : Sep 2, 2022, 6:48 AM IST

INS Vikrant : భారతీయుడి ఆత్మ నిర్భరతకు, మేథస్సుకు ప్రతీకగా ఐఎన్​ఎస్​- విక్రాంత్‌ నిలవనుంది. 1971 యుద్ధంలో సేవలు అందించిన దేశ మొదటి విమాన వాహక నౌక.. ఐఎన్​ఎస్​-విక్రాంత్‌ పేరుతోనే దీనికి నామకరణం చేశారు. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ అత్యాధునిక యుద్దనౌక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదగా భారత అమ్ముల పొదిలోకి శుక్రవారం చేరనుంది.

262 మీటర్ల పొడవు, 62 వెడల్పు..
262 మీటర్ల పొడవు, 62 వెడల్పును కలిగిన ఉన్న ఈ బాహుబలి నౌక, గంటకు గరిష్ఠంగా 28 నాటికల్‌మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే గంటకు 51.8 కిలోమీటర్ల స్పీడుతో సముద్రంలో దూసుకెళ్లనుంది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ద్వారా 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను తీసుకెళ్లొచ్చు. 45వేల టన్నుల ఈ యుద్ధ నౌక నుంచి శత్రు దేశాల విమానాలు, క్షిపణులను లక్ష్యంగా చేసుకోవచ్చు. యుద్ధ సమయాల్లో విమానాలు అలా గాల్లోకి ఎగిరి, శత్రువు పని పట్టేసి ఇలా తిరిగి వచ్చేసేలా ఈ యుద్ధ నౌకలో ఏర్పాట్లు ఉన్నాయి.

విధుల్లో 1,700 మంది సిబ్బంది..
ఐఎన్​ఎస్​ విక్రాంత్‌ యుద్ధనౌకలో 1,700 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. యుద్ధ సమయంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందించేందుకు యుద్ధనౌకలో భారీ ఏర్పాట్లు చేశారు. 16 పడకలతో చిన్నపాటి ఆసుపత్రిని నిర్మించారు. అలాగే రెండు ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీలు, వార్డులు, ఐసీయూలు, ఒక సీటీ స్కాన్‌మెషీన్ ఉన్నాయి. ఇక్కడ ఐదుగురు వైద్య అధికారులు, 15 మంది ఆరోగ్య సిబ్బంది పనిచేస్తారు.

2,300 కంపార్ట్​మెంట్లు, నిచ్చెనలు..
విక్రాంత్‌ లోపల దాదాపు 2,300 కంపార్ట్‌మెంట్లను నిర్మించారు. లోపల ఉన్న అంతస్తుల్లోకి వెళ్లేందుకు నిచ్చెనలు, ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. సముద్రంపై ఉండే విభిన్న వాతావరణ పరిస్థితులకు నౌకలోని సిబ్బంది గురికాకుండా ఉండేందుకు ఎయిర్‌ కండీషనింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని వల్ల అధిక వేడిమి, చలి తెలియదు.

2005లో కేరళలో..
ఐఎన్​ఎస్​ విక్రాంత్ తయారీ 2005లో కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో ప్రారంభమైంది. స్వదేశీకరణకు మరింత ఊతం ఇచ్చేందుకు స్టీల్ అథారిటీ ఆఫ్‌ఇండియా లిమిటెడ్‌ఈ నౌక తయారీకి అవసరమైన ఉక్కు అందించేందుకు సిద్ధమైంది. విక్రాంత్ రూపకల్పనలో స్టీల్ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో పాటు బీహెచ్​ఈఎల్​ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ఎల్‌అండ్‌టీ లాంటి ప్రైవేటు సంస్థలు సహా వంద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పరికరాలను తయారు చేసి ఇచ్చాయి.

2వేల మంది సెయిల్​ ఉద్యోగులతో..
దీని తయారీ కోసం సెయిల్‌ ఉద్యోగులు 2వేల మంది పని చేయగా, మరో 13వేల మంది బయట శ్రమించారు. హైదరాబాద్‌ సహా దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ యుద్ధ నౌక పరికరాలు తయారయ్యాయి. 76శాతం భారతీయ సాంకేతికతనే దీని తయారీకి వినియోగించారు. విక్రాంత్‌ తయారీకి మొత్తం 20వేల కోట్ల రూపాయల ఖర్చు అయ్యింది.

ఐఎన్​ఎస్​ విక్రాంత్‌ రాకపై భారత నౌకాదళం చాలా సంతోషంగా ఉంది. భారత నౌకాదళంలోని యుద్ధ నౌకలు అన్నింటినీ ముందుండి నడిపిస్తూ ఇది నాయకత్వం వహించగలదని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆధిపత్యం పెరగడం, శ్రీలంక, మాల్దీవుల పరిధిలోని సముద్ర జలాల్లో తమ నౌకలను మోహరిస్తూ అది భారత్‌ను కవ్విస్తున్న పరిస్థితుల మధ్య ఐఎన్​ఎస్​-విక్రాంత్‌రాక తమకు ఎంతో బలాన్ని ఇవ్వగలదని భారత నౌకాదళం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. పొరుగు దేశాల బలం పెరగడం, వారి నుంచి సదా ముప్పు పొంచి ఉంటున్న నేపథ్యంలో దీని రాకతో తమకు అనేక ప్రయోజనాలు కల్గుతాయని అంటోంది. ఐఎన్​ఎస్​-విక్రాంత్.. ఇండో-పసిఫిక్‌ప్రాంతంలో శాంతి, సుస్థిరతను కాపాడడంలో కీలక పాత్ర పోషించగలదని నౌకాదళం ధీమాతో ఉంది.

ఇవీ చదవండి: ఝార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. సర్వత్రా ఉత్కంఠ!

20 వేల ప్రతిమలతో 'గణేశ్' ఎగ్జిబిషన్​.. బైక్​ నడుపుతూ, వీణ వాయిస్తూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.