ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో 100% మందికి తొలి డోసు- మోదీ ప్రశంసలు - వ్యాక్సినేషన్​

కరోనా టీకా పంపిణీలో(Corona vaccination) గోవా కీలక మైలురాయిని అందుకుంది. అర్హులైనవారందరికీ కొవిడ్​ తొలి డోసు టీకా వేసినట్లు ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్​ సావంత్​ ప్రకటించారు. గోవాలో నూరు శాతం వ్యాక్సినేషన్​పై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

Covid vaccine administered
కరోనా వ్యాక్సినేషన్​
author img

By

Published : Sep 10, 2021, 9:30 PM IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌(Covid vaccine) విషయంలో గోవా అరుదైన మైలురాయి సాధించింది. రాష్ట్రంలో అర్హులైన అందరికీ కొవిడ్‌ మొదటి డోసు(vaccine first dose) వ్యాక్సిన్‌ వేసినట్లు(Vaccination) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ప్రకటించారు. అక్టోబర్‌ 31 నాటికి ప్రజలందరికీ రెండో డోసు(covid vaccine second dose) కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ అదుపులోనే ఉందని చెప్పారు. అర్హులైన వారంతా సకాలంలో రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు.

Covid vaccine administered
గోవాలో 100 శాతం వ్యాక్సినేషన్​ పూర్తి

అంతకుముందు హిమాచల్‌ ప్రదేశ్‌ సైతం ఇలాంటి ప్రకటనే చేసింది. అర్హులైన వారందరికీ నూరు శాతం వ్యాక్సిన్‌ వేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. నవంబర్‌ 30 నాటికి అందరికీ రెండు డోసులూ పూర్తిచేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. అర్హులైన నూరు శాతం తొలి డోసు పూర్తిచేసిన తొలి రాష్ట్రంగా హిమాచల్‌ప్రదేశ్‌ నిలవగా.. గోవా రెండోస్థానంలో ఉంది.

గోవాలో నూరు శాతం వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. జట్టుగా విజయం సాధించారంటూ కొనియాడారు.

ఇదీ చూడండి: అర్హులందరికీ తొలి డోసు పూర్తి.. ఆ రాష్ట్రానికి మోదీ అభినందన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.